kannappa మూవీలో మరో స్టార్ హీరో.. ఏకంగా బాలీవుడ్ కలెక్షన్ కింగ్​నే రంగంలోకి దింపారుగా​

- Advertisement -

kannappa : టాలీవుడ్ నటుడు మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. స్టార్ ప్లస్ ఛానెల్​లో ప్రసారమైన మహాభారత్ సిరీస్​ను తెరకెక్కించిన ముఖేశ్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక చిత్రం పాన్ ఇండియా మూవీగా రూపొందుతోంది. ఈ సినిమాలో పాన్ ఇండియా నటులు కూడా ఉన్నారు. ఇప్పటికే వివిధ సినిమా ఇండస్ట్రీలకు చెందిన పలువురు స్టార్ నటులు ఇందులో భాగమయ్యారు. ఇక టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా ఈ చిత్రంలో భాగమైనట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

kannappa
kannappa

అయితే తాజాగా ఈ చిత్ర బృందంలోకి మరో స్టార్ హీరో ఎంట్రీ ఇచ్చాడు. బాలీవుడ్​లో సంవత్సరానికి నాలుగు హిట్లు అందిస్తూ దాదాపుగా ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యే బీ టౌన్ కలెక్షన్ కింగ్, కిలాడీ అక్షయ్ కుమార్ కన్నప్పలో నటిస్తున్నారు. అక్షయ్‌ కుమార్‌ ఈ సినిమాలో భాగం కానున్నారని తెలుపుతూ ఓ వీడియో విడుదల చేసింది.‘‘సూపర్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ను తెలుగు చిత్ర పరిశ్రమలోకి స్వాగతం పలుకుతున్నందుకు ఆనందంగా ఉంది. ఆయన భాగం కావడంతో కన్నప్ప మరింత ఉత్కంఠభరితంగా మారింది. మాకు థ్రిల్‌గా ఉంది. మర్చిపోలేని సాహసానికి సిద్ధంగా ఉండండి’’ అని ఈ వీడియో కింద క్యాప్షన్ కూడా ఇచ్చింది.

అయితే అక్షయ్ కుమార్ ఇప్పటి వరకు స్ట్రెయిట్ తెలుగు సినిమా చేయలేదు. గతంలో 1993లో ఓ కన్నడ సినిమాలో కనిపించారు. ఆ తర్వాత 2018లో రజనీ హీరోగా తెరకెక్కిన రోబో2.0లో తమిళ పరిశ్రమకి పరిచమయ్యారు. ఆ సినిమా తెలుగులో కూడా డబ్ అయింది. అయితే ఆ చిత్రంలో పక్షిరాజుగా యానిమేటెడ్ క్యారెక్టర్​లో కనిపించడంతో అక్షయ్ నటన తెలుగు ప్రేక్షకులుగా అంతగా గ్రహించలేకపోయారు. ఇక ఇప్పుడు ఈ మూవీతో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టనున్నారు. ఇటీవల ‘ఓమైగాడ్‌2’లో అక్షయ్‌ శివుడిగా కనిపించి మెప్పించిన సంగతి తెలిసిందే. ‘కన్నప్ప’లోనూ ఆయన ఆ మహదేవుడి పాత్రలో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొన్నటి వరకు శివుడి పాత్రలో ప్రభాస్ కనిపించనున్నట్లు టాక్‌ వినిపించింది. ఇప్పుడు అక్షయ్‌ ఎంట్రీ ఇవ్వడంతో మలుపు తిరిగింది.

- Advertisement -

ఇక ఈ సినిమాలో మంచు మోహన్‌ బాబు, మోహన్‌ లాల్‌, శివరాజ్‌కుమార్‌, శరత్‌ కుమార్‌ భాగమైన విషయం తెలిసిందే. విష్ణు టైటిల్‌ రోల్‌ పోషిస్తుండగా.. ప్రభాస్‌, నయనతారలు కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం. ఇందులో భరతనాట్యంలో నిష్ణాతురాలైన ప్రీతి కథానాయికగా కనిపించనున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here