Ajith Kumar : పెళ్లి చేసుకుంటాను అని మాటిచ్చి ఆ హీరోయిన్ ని దారుణంగా మోసం చేసిన హీరో అజిత్!

- Advertisement -

Ajith Kumar : తమిళం లో ప్రస్తుతం టాప్ 3 స్టార్ హీరోల లిస్ట్ తీస్తే అందులో అజిత్ ముందు వరుసలో ఉంటాడు. ఈయనకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ తమిళం లో ఏ హీరో కి కూడా లేదు అని అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఏం జీ రామచంద్రన్ మరియు సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత తమిళనాడు లో కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో ఈయన మాత్రమే. అయితే ఎక్కువగా తన సినిమాల ప్రొమోషన్స్ లో పాల్గొనడానికి ఇష్టపడడు.

Ajith Kumar
Ajith Kumar

సినిమా బాగుంటే ప్రొమోషన్స్ అక్కర్లేదు అనేది ఆయన పాలసీ. అదంతా పక్కన పెడితే అజిత్ ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరోయిన్ షాలిని ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అనే విషయం అందరికీ తెలిసిందే. ఎంతో అన్యోయంగా దాంపత్య జీవితం కొనసాగిస్తున్న ఈ ఇద్దరికీ ఒక పాప మరియు ఒక బాబు ఉన్నారు. ఎక్కువగా మీడియా కి కనపడకుండా చాలా ప్రైవేట్ జీవితాన్ని గడపడానికే అజిత్ ఇష్టపడతాడు.

అయితే అజిత్ గురించి మనకెవ్వరికీ తెలియని ఒక ఆసక్తికరమైన విషయం ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. అదేమిటంటే అజిత్ షాలిని కంటే ముందే హీరా రాజ్ గోపాల్ అనే హీరోయిన్ తో గాఢంగా ప్రేమాయణం నడిపాడట. అజిత్ ఇండస్ట్రీ లోకి రాకముందు నుండే ఆమె తమిళం లో పెద్ద స్టార్ హీరోయిన్. అయితే అజిత్ తో సినిమా చేసిన తర్వాత అతనితో పరిచయం ఏర్పడి, ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది.

- Advertisement -

ఈమెతో ప్రేమలో ఉండడం వల్లే అజిత్ కి కోలీవుడ్ లో వరుసగా అవకాశాలు వచ్చాయని అంటుంటారు. అలా వాళ్ళిద్దరి మధ్య ప్రేమాయణం కొంతకాలం నడిచిన తర్వాత, కొన్ని అనుకోని కారణాల వల్ల విడిపోవాల్సి వచ్చింది. అజిత్ ఎందుకో కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల పెళ్ళికి ఒప్పుకోలేదని, అలా వీళ్లిద్దరి పెళ్లి పెటాకులు అయ్యింది అంటూ కోలీవుడ్ లో ఎన్నో ఏళ్ళ నుండి ప్రచారం అయ్యే వార్త.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here