Actor Ajith ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో స్టార్ హీరోలు సైతం పని చెయ్యాలని అనుకుంటున్నా దర్శకులలో ఒకరు ప్రశాంత్ నీల్. కన్నడ చిత్ర పరిశ్రమకి చెందిన ఈయన కేజీఎఫ్ సిరీస్ తో ఒక్కసారిగా పాన్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు. రీసెంట్ గా ప్రభాస్ తో తీసిన సలార్ చిత్రం కూడా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ప్రస్తుతం ఈయన కాల్ షీట్స్ కోసం బడా సూపర్ స్టార్స్ అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ప్రశాంత్ నీల్ ప్రస్తుతానికి ఎన్టీఆర్ తో ఒక సినిమా, ప్రభాస్ తో సలార్ 2 తో పాటుగా, మరో సినిమా. అలాగే రామ్ చరణ్ తో ఒక సినిమా, కేజీఎఫ్ 3 సినిమాలకు కమిట్ అయ్యి ఉన్నాడు. ఈ ఏడాదిలోనే ఎన్టీఆర్ తో తియ్యబోయే సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.

సలార్ 2 షూటింగ్ కూడా అతి త్వరలోనే మొదలు కానుంది. అయితే ఈ ప్రాజెక్ట్స్ మాత్రమే కాకుండా తమిళం లో బడా సూపర్ స్టార్ గా చలామణి అవుతున్న అజిత్ తో రెండు ప్రాజెక్టులు కమిట్ అయ్యినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రెండు సినిమాలు కూడా కేజీఎఫ్ చిత్రనితో లింక్ అయ్యి ఉంటుందట. ఇటీవలే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అజిత్ తో కలిసి ఈ ప్రాజెక్ట్స్ పై సుదీర్ఘ చర్చలు జరిపినట్టు తెలుస్తుంది. అజిత్ కూడా ఓకే చెప్పడంతో కేజీఎఫ్ సిరీస్, సలార్ సిరీస్ ని నిర్మించిన హోమబుల్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. అజిత్ కి తమిళనాడు లో తెలుగు లో పవన్ కళ్యాణ్ కి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో, అలాంటి సరిసమానమైన ఫాలోయింగ్ ఉంటుంది.
ఆయన దాదాపుగా కెరీర్ మొత్తం స్టార్ డైరెక్టర్ల సహాయం లేకుండానే సూపర్ స్టార్ అయ్యాడు. ఇప్పుడు కూడా ఆయన తోటి స్టార్ హీరోలు పెద్ద పెద్ద పాన్ ఇండియన్ డైరెక్టర్స్ తో క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తూ పోతుంటే, అజిత్ మాత్రం పసలేని దర్శకులతో పని చేస్తూ పోతున్నాడు. ఆయన అభిమానుల్లో ఈ విషయంపై తీవ్రమైన అసంతృప్తి ఉండేది. కానీ ఇప్పుడు ప్రశాంత్ నీల్ లాంటి డైరెక్టర్ తో ఏకంగా రెండు సినిమాలు చెయ్యబోతుండడంతో అభిమానుల ఆనందానికి హద్దులే లేకుండా పోయింది. అజిత్ గత చిత్రం తూనీవు బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ టాక్ తెచుకున్నప్పటికీ కమర్షియల్ గా సక్సెస్ అయ్యింది. ప్రస్తుతం ఆయన ‘విడముయార్చి’,’గుడ్ బ్యాడ్ అగ్లీ’ వంటి చిత్రాల్లో నటిస్తున్నాడు.