Aishwarya Rajesh : తమిళ్ లో వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించిన ఐశ్వర్య రాజేష్ మొన్నామధ్య వరుసగా తెలుగు సినిమాల్లోనూ నటించి ఆడియన్స్ ను ఆకట్టుకుంది. 2018లో వచ్చిన కౌసల్య కృష్ణమూర్తి సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది ఈ చిన్నది. అంతకు ముందు చాలా తెలుగు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించింది. ఇక తెలుగులోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుసగా సినిమాలు చేసింది ఐశ్వర్య. విజయ్ దేవరకొండతో వరల్డ్ ఫెమస్ లవర్, నాని తో టక్ జగదీశ్, సాయి ధరమ్ తేజ్ తో రిపబ్లిక్ లాంటి సినిమాల్లో నటించింది ఐశ్వర్య రాజేష్.

ఈ సినిమాలన్నీ నిరాశపరిచినా.. ఐశ్వర్య రాజేష్ నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. ప్రస్తుతం ఈ అమ్మడు తమిళ్ సినిమాల పై ఎక్కువ దృష్టి పెట్టింది. అక్కడ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుంది ఈ చిన్నది. అయితే ఈ మధ్య ఐశ్వర్య రాజేష్ పై ఓ దర్శకుడు సంచలన కామెంట్స్ చేశారు. తమిళ్ దర్శకుడు వీరపాండియన్ ఐశ్వర్య రాజేష్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఐశ్వర్య రాజేశ్‌ని నేనే పరిచయం చేశా.. ఇప్పుడు స్టార్ హీరోయిన్ అయ్యి ఫోజులు కొడుతుంది అన్నారు. “నేను డైరెక్ట్ చేసిన సినిమాతోనే ఐశ్వర్య రాజేశ్ పరిచయం అయ్యింది.. ఆ విషయం ఆమె ఎక్కడా కూడా చెప్పలేదు. ఇప్పుడు స్టార్ డమ్ రావడంతో నాతో సినిమా చేయడానికి ఆసక్తి చూపించడం లేదు.. ఒకప్పుడు ఆమెకు ఆటోకు కూడా డబ్బులు లేకపోతే నేనే ఇచ్చాను ” అని అన్నారు.

దీని పై ఐశ్వర్య రాజేష్ సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ.. ఆయన పేరు ఎత్తకుండా ఓ ట్వీట్ చేశారు. చాలా మంది ఒక వైపే విని మాట్లాడుతూ ఉంటారు. అసలు విషయాలు తెలుసుకోకుండా ఓ నిర్ణయానికి వచ్చి జీవితంలోని అనుబంధాలను చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైనా సరే.. పూర్తిగా తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది” అంటూ రాసుకొచ్చింది ఐశ్వర్య రాజేష్.