టాలీవుడ్ పెద్ద దిక్కైన చిరంజీవి ఇటీవల భోళా శంకర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ ఆ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. విడుదలైన ఫస్ట్ షో నుంచే ‘ఏంటి మా మెగాస్టార్ ఈ సినిమా ఎలా తీశారు.. ఆ డైరెక్టర్ ను ఎలా నమ్మారంటూ వాపోతున్నారు. సినిమా విడుదలైన రెండో రోజే థియేటర్లలో 75శాతం ఆక్యుపెన్సీ పడిపోయిందంటే చిత్ర పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. చిరు కెరీర్లో ఎవరూ ఊహించని కలెక్షన్లు వచ్చాయి. దీంతో బ్రేక్ ఈవెన్ దాటటం అట్లుంచి పెట్టిన పెట్టుబడిలో దాదాపు సగం కూడా వచ్చే అవకాశం లేనట్లే కనిపిస్తోంది. ఈ సినిమాను ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర నిర్మించారు. అంతకుముందు ఏప్రిల్ లో అఖిల్ నటించిన ఏజెంట్ సినిమాను కూడా వీరే నిర్మించారు. ఈ రెండు చిత్రాలకు నిర్మాత ఒక్కరే.. దీంతో ఈ రెండు సినిమాలు కూడా ఇండస్ట్రీ డిజాస్టర్లుగా నిలిచాయి. దీంతో అనిల్ సుంకర కొన్ని వందల కోట్ల రూపాయలు నష్టపోయారట. ఎంత నష్టపోయారో తెలుసుకుందాం.

అఖిల్ హీరోగా నటించిన ఏజెంట్ సినిమా బడ్జెట్ దాదాపు రూ .70 కోట్లు. విడుదలైన తర్వాత ఏజెంట్ రూ .12 కోట్లు మాత్రమే రాబట్టగలిగింది. ఇక సినిమా ఓటీటీలో అయినా వస్తుందని చూస్తే ఏమైందో తెలియదు కానీ దాని జాడే లేదు. దీంతో ఏజెంట్ చిత్రానికి దాదాపు రూ.55 కోట్లు నష్టం వాటిల్లింది. ఇక భోళా శంకర్ సినిమాను చిత్ర నిర్మాణ సంస్థ దాదాపు రూ .101 కోట్లు పెట్టి తెరకెక్కించారు. అయితే విడుదలైన ఫస్ట్ డే రూ .28 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాకి ఇంకా రూ .75 కోట్లు వస్తేకానీ పెట్టిన పెట్టుబడి పూడే పరిస్థితి లేదు. ప్రస్తుత పరిస్థితి చూస్తూ ఉంటే రూ.50కోట్లు కూడా రావటం కష్టమే. చిరంజీవి అంటే ఎగబడే డిస్టిబ్యూటర్లు, డిజిటల్ రైటర్లు కూడా సినిమా అంటే భయపడుతున్నారు. విశేషమేమిటంటే ఇప్పటికీ ఈ సినిమా శాటిలైట్ రైట్స్ అమ్ముడు కాకపోవటం. రెండు దారుణమైన పరాజయాల కారణంగా నిర్మాత అనిల్ సుంకరకు దాదాపు రూ.130కోట్ల నష్టం వాటిల్లింది.
