Aditi Rao Hydari : హీరో సిద్దార్థ్, హీరోయిన్ అదితిరావు హైదరి ఇటీవలే తమ ప్రేమని అఫీషియల్ గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. గత నెలలో ఎంగేజ్మెంట్ రింగులు మార్చుకొని తమ ప్రేమ ప్రయాణాన్ని పెళ్లి వైపు మలుపు తిప్పారు. త్వరలోనే ఏడడుగులు వేయనున్నారు.

కాగా ఏప్రిల్ 17న సిద్దార్థ్ పుట్టినరోజు కావడంతో.. ఫ్యాన్స్ తో పాటు సెలబ్రిటీస్ అందరూ సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలియజేస్తూ వస్తున్నారు. అయితే నెటిజెన్స్ అంతా అదితి నుంచి వచ్చే విషెస్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇక నెటిజెన్స్ ఎదురు చూపులకు తెరదించుతూ అదితి.. తన ఫియాన్సీకి బర్త్ డే విషెస్ తెలియజేస్తూ పోస్ట్ వేశారు. “హాపిస్ట్ బర్త్ డే మై మానికార్న్” అంటూ పోస్ట్ వేశారు.
మానికార్న్ అంటే.. ఒకే లక్షణాలు, ఇష్టాలు కలిగి ఉన్న వ్యక్తిని మరో వ్యక్తి సంబోధించడం కోసం ఉపయోగించే పదం. అలాగే మరికొంత నోట్ కూడా అదితి రాసుకొచ్చారు. “ఎప్పుడు నవ్వుతూ, నవ్విస్తూ ఉండే నీకు.. మరింత శక్తి చేకూరాలని, నువ్వు అనుకున్నవి జరగాలని కోరుకుంటున్నాను” అంటూ రాసుకొచ్చారు. ఈ నోట్ తో మూడు పిక్స్ ని కూడా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.