Aditi Rao Hydari ఈ రాజకుమారి ప్రస్తుతం ముంబయిలో సెటిల్ అయింది. బాలీవుడ్లో సినిమాలు చేస్తూ బిజీగా అయిపోయింది. ఈ భామ సమ్మోహనం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. తొలి సినిమాతోనే ప్రేక్షకులను సమ్మోహనపరిచింది. తన అందం.. అభినయంతో అందరిని ఆకట్టుకుంది. సమ్మోహనం సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఈ బ్యూటీ టాలీవుడ్లో అవకాశాలు వచ్చాయి. సమ్మోహనం తర్వా అదితీ.. మణిరత్నం చెలియా సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద బోర్లా పడినా ఈ భామ అందానికి ప్రేక్షకులు మరోసారి ఫిదా అయ్యారు.

ఇక ఆ తర్వాత సౌత్‌లో అదితీ హిట్ ఫ్లాప్ సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ పోయింది. అందులో భాగంగా వచ్చినవే సూఫియుమ్ సుజాతయుమ్, మహాసముద్రం, వీ, హే సినామిక. ఈ సినిమాల్లో అదితీ నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా సూఫియుమ్ సుజాతయుమ్ మూవీలో అదితీ నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు వచ్చాయి. సౌత్‌లో అదితీకి పెద్దగా కలిసి రాలేదు. అడపాదడపా సినిమాలు చేస్తూ అప్పుడప్పుడు సౌత్ ప్రేక్షకులను పలకరిస్తోంది అదితీ.

ఈ భామ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. తరచూ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. తాజాగా అదితీ సరికొత్తగా ఫొటోషూట్ చేసింది. ఈ ఫొటోషూట్‌లో ఈ భామ ట్రెడిషనల్ డ్రెస్సులో మెరిసింది. ట్రెడిషనల్ ఔట్ఫిట్లో అదితీ కుందనపు బొమ్మలా ఉంది. గ్రీన్ కలర్ లెహంగాలో ప్రకృతి అంతా తనలోనే మమేకమైనట్లు మెస్మరైజింగ్‌గా కనిపించింది అదితీ. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

అదితీ ఎంత అందంగా ఉందోనంటూ కుర్రాళ్లు తెగ మురిసిపోతున్నారు. అందమైన కుందనాల బొమ్మ అంటూ పాటలు పాడేసుకుంటున్నారు. అదితీ లేటెస్ట్ ఫొటోలు నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ ఫొటోలు చూసి కుర్రాళ్లు మాయలో పడిపోతున్నారు. అదితీ అందం చూసి తమ గుండె జారి గల్లంతయిందంటూ పాటలు పాడుకుంటున్నారు. హార్ట్ ఎమోజీస్ పోస్టు చేస్తూ తమ ప్రేమను కురిపించేస్తున్నారు.