మలుపు తిరిగిన ఆదిపురుష్‌ వివాదం.. చివరికి డబ్బులిచ్చి ట్వీట్లు తొలగించమని వేడుకుంటున్నారుగా

- Advertisement -

పాన్ ఇండియా సినిమాగా ‘ఆదిపురుష్‌’ను అత్యంత భారీ బ‌డ్జెట్‌తో నిర్మించారు. బాలీవుడ్ స్టార్ ద‌ర్శ‌కుడు ఓం రౌత్ ‘ఆదిపురుష్’ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. పాన్ వ‌ర‌ల్డ్ సినిమాగా ‘ఆదిపురుష్’ హిస్ట‌రీ క్రియేట్ చేస్తుంద‌నే ననమ్మకంతో మొన్నటి వరకు చిత్రబృందం అంతా అనుకున్నారు. ఇలాంటి ఎన్నో అంచనాల మధ్య తాజాగా ఈ సినిమా విడుదలైంది. భారీ అంచ‌నాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఆదిపురుష్ చిత్రం డిజాస్ట‌ర్ అయింది.

ఆదిపురుష్‌
ఆదిపురుష్‌

ద‌ర్శ‌కుడు ఓం రౌత్ క‌థ‌ని వ‌క్రీక‌రించి త‌న‌కు న‌చ్చిన‌ట్టుగా సినిమా తీసాడ‌ని కొంద‌రు వాపోతున్నారు.ఇది క‌లియుగ రామాయ‌ణంలా ఉంద‌ని, చిత్రంలో రాముడి పాత్ర‌, సీత పాత్ర‌, రావ‌ణుడి పాత్ర ఏమంత బాగోలేవ‌ని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.అయితే సినిమాపై ఒకవైపు నెగెటివ్ టాక్ వ‌స్తున్నా కూడా వ‌సూళ్లు బాగానే వ‌స్తున్నాయి. కాక‌పోతే ద‌ర్శ‌కుడితో పాటు చిత్ర బృందంపై సోష‌ల్ మీడియాలో దారుణ‌మైన ట్రోలింగ్ న‌డుస్తుంది. డైరెక్ట‌ర్ ఓం రౌత్ మన సంస్కృతిని పక్కన పెట్టి హర్రర్ మూవీలా రామాయణాన్ని మార్చేసాడ‌ని మండిప‌డుతున్నారు.ఆ స్థానంలో హీరోగా ప్ర‌భాస్ లేక‌పోయి ఉంటే మూవీ భారీ ఫ్లాప్‌గా నిలిచేద‌ని చెబుతున్నారు.

మ‌రోవైపు ఈ సినిమాని అనేక వివాదాలు చుట్టు ముడుతున్నాయి. తాజాగా ఆదిపురుష్ మేక‌ర్స్ డ్యామేజ్ కంట్రోల్ చేయ‌డానికి రాంగ్ వేని ఎంచుకున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతుంది. డాక్టర్ నిమో యాదవ్ అనే వ్యక్తికి ట్విట్టర్ లో 50 వేల‌కి పైగా ఫాలోవ‌ర్స్ ఉండ‌గా, ఆయ‌న చేసిన ఆరోపణలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. ఓ అజ్ఞాత వ్య‌క్తి.. నిమోకి మెసేజ్ ఇలా పెట్టాడు. ‘హలో డాక్టర్ నిమో యాదవ్, మీకు అర్జెంటు రిక్వెస్ట్.. ఆదిపురుష్ పై నెగిటివ్ ట్వీట్స్ డిలీట్ చేసి పాజిటివ్ పోస్ట్ లు పెడితే.. ఒక్కో పోస్ట్ కి రూ 9500 ఇస్తాం.

- Advertisement -

వెంటనే అలా చేసి ఆ విష‌యాన్ని మాకు తెలియజేయండి మీకు డబ్బు వస్తుంది’ అనే మెసేజ్ రాగా, దానిని అతడు తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. మరో ట్విటర్‌ యూజర్‌కు ఏకంగా ఒక్క పోస్ట్‌ డిలీట్‌ చేస్తే రూ.10000 ఇస్తామంటూ టీ సిరీస్‌ వాళ్లు మెసేజ్‌లు పెడుతున్నారుట. అయితే ఈ మెసేజ్‌లు ఎక్కడ నుంచి వస్తున్నాయో తెలియడం లేదు. ప్రస్తుతం ఇవి నెట్టింట వైరల్‌గా మారుతున్నాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here