అందరూ ఇంతలా తిడుతున్న ఆదిపురుష్ రైటర్ ఎంత గొప్ప వాడో తెలుసా..

- Advertisement -

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాముడిగా నటించిన ‘ఆదిపురుష్’ చిత్రం రూ. 200 కోట్ల క్లబ్‌లో చేరింది. మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 140 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ చిత్రం.. రెండు రోజుల్లో 200 కోట్లు క్రాస్ చేసింది. అయితే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్‌పరంగా సత్తా చాటుతున్నప్పటికీ రోజుకో కాంట్రవర్సీ ఆదిపురుష్‌ను చుట్టుముడుతోంది. రాముడు, హనుమంతుడు పాత్రల వేషధారణపై హిందూ సేన అభ్యంతరాలు వ్యక్తం చేయడం, మరికొన్ని వర్గాలు డైలాగ్స్‌ను తప్పుపట్టడం తెలిసిందే. ఇదే క్రమంలో ఆదిపురుష్‌ మూవీ రైటర్‌ మనోజ్ ముంతాషిర్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట దుమారం రేపుతున్నాయి. తాము అసలు రామాయణాన్ని తెరకెక్కించలేదని ‘ఆదిపురుష్’ గురించి తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు.

మనోజ్ ముంతాషిర్

అయితే ఈ రైటర్ గురించి నెట్టింట తెగ వెతికేస్తున్నారుట జనాలు. ఇంతకీ ఈ మనోజ్ ముంతాషిర్ ఎవరు ?.. అతని ఫిల్మ్ కెరియర్ ఏంటీ అంటూ నెటిజన్స్ తెగ సెర్చ్ చేస్తున్నారు. అసలు ఆయనెవ్వరో చూద్దాం.. మనోజ్ ముంతాషిర్.. 1976 ఫిబ్రవరి 27న ఉత్తరప్రదేశ్‌లోని గౌరీగంజ్‌లో జన్మించారు. అతని తండ్రి రైతు కాగా తల్లి ఉపాధ్యాయురాలు. మనోజ్ ముంతాషిర్ అసలు పేరు మనోజ్ శుక్లా.. ముంతాషిర్ అనేది అతని కలం పేరు. చిన్న వయస్సు నుంచే అతనికి పద్యాలు రాయడంపై ఆసక్తి ఉండేది. అతను ఎక్కువగా ముషాయిరాస్‌లో తన కవితలను చదివేవాడు. మొదట్లో అతను ప్రయాగ్‌రాజ్‌లోని ఆల్ ఇండియా రేడియోలో పనిచేశాడు. ఆ సమయంలో అతనికి రూ.135 మాత్రమే వచ్చేవి. అలహాబాద్ యూనివర్శిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత ముంబై వచ్చాడు. అతను మొదట భజన్ సామ్రాట్ అనూప్ జలోటాను కలిసి ఓ కవిత చెప్పగా.. రూ.3000 సంపాదించాడు.

ఆ తర్వాత కౌన్ బనేగా కరోడ్ పతి కోసం ఓ సాంగ్ రాశాడు. 2014లో శ్రేయా ఘోషల్ కు పాడిన గజల్ ఆల్బమ్ హమాన్ షీన్ గుర్తింపు వచ్చింది. 2014లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఏక్ విలన్ చిత్రంలో తేరి గలియాన్ సాంగ్ రాశాడు. ఈ పాట పెద్ద హిట్ కావడమే కాకుండా.. అతడి కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అయ్యింది. ఈ పాటకు అతను చాలా అవార్డ్స్ అందుకున్నాడు. ఆ తర్వాత ఎంఎస్ ధోని.. ది అన్ టోల్డ్ స్టోరీ, కాబిల్, హాఫ్ గర్ల్ ఫ్రెండ్, బాహుబలి (హిందీ), పికే, బేబీ, కపూర్ అండ్ సన్స్, రుస్తోమ్, కబీర్ సింగ్, రామ్ సేతు, విక్రమ్ వేద చిత్రాలకు సాంగ్స్ రాశాడు. బాహుబలి సినిమాకు మనోజ్ ముంతాషిర్ హిందీ డైలాగ్స్ రాశారు. ఇక ఇప్పుడు ఆదిపురుష్ సినిమాకు సైతం డైలాగ్స్ రాశారు మనోజ్ ముంతాషిర్.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here