యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన ‘ఆదిపురుష్’ చిత్రం రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ టాక్ ఎలా ఉన్నప్పటికీ మొదటి మూడు రోజుల్లోనే ఈ సినిమా 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కానీ వర్కింగ్ డేస్ ప్రారంభమైన వెంటనే ఈ చిత్రం వసూళ్లు దారుణంగా పడిపోయాయి.
అంతే కాకుండా హిందూ సంఘాలు కూడా ఈ చిత్రం ని ఆపివెయ్యాలంటూ కోర్టు లో కేసులు వెయ్యడం, థియేటర్స్ ద్వంసం చెయ్యడం వంటివి ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో నెగటివ్ భావం ఒక రేంజ్ లో పెరిగింది. అందుకే సినిమా చూసేందుకు డీసెంట్ గా ఉన్నప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయి లో విజయం సాధించలేకపోయింది. అయితే హిందీ లో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కి చాలా దగ్గరగా వచ్చిందని అంటున్నారు ట్రేడ్ పండితులు.
ట్రేడ్ పండితుల లెక్క ప్రకారం ఈ సినిమాకి విడుదలకు ముందే హిందీ లో 75 కోట్ల రూపాయలకు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. మూడు వారాలకు గాను ఈ సినిమా అక్కడ 130 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టిందని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇక లక్షల్లోనే నెట్ వసూళ్లు వస్తాయని, థియేట్రికల్ రన్ దాదాపుగా పూర్తి అయ్యినట్టే అని ట్రేడ్ పండితులు చెప్తున్నారు.
అంటే ఇప్పటి వరకు ఈ సినిమా అక్కడ 70 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రాబట్టింది అట,ఇదే క్లోసింగ్ కలెక్షన్స్ అని కూడా అంటున్నారు. మరో 5 కోట్ల రూపాయిలు వసూలు చేస్తే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకున్నట్టే. అది దాదాపుగా అసాధ్యం అనే అంటున్నారు, అలా ఓవరాల్ గా ఆదిపురుష్ చిత్రం హిందీ వెర్షన్ వరకు కమర్షియల్ గా ఎబోవ్ యావరేజి అని చెప్పొచ్చు.