Actress Vichithra : మన టాలీవుడ్ లోనే కాదు , ఏ ఇండస్ట్రీ లో అయినా క్యాస్టింగ్ కౌచ్ సమస్య చాలా కామన్ గా ఉంది. ఇది నిన్న మొన్న పుట్టిన సమస్య కాదు, మనం పుట్టక ముందు నుండే ఇండస్ట్రీ లో ఉన్న అతి క్లిష్టమైన సమస్య ఇది. వీటిని అరికట్టే సత్తా కేవలం స్టార్ హీరోలకు మాత్రమే ఉంది. కానీ అలాంటి స్టార్ హీరోలే క్యాస్టింగ్ కౌచ్ కి పాల్పడితే ఇక అప్పుడే ఇండస్ట్రీ కి వచ్చిన అమ్మాయిల పరిస్థితి ఏమిటో ఒక్కసారి ఆలోచించండి.

ప్రముఖ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ఒక హీరోయిన్ పట్ల ఇలాగే ప్రవర్తించాడట. ఆమె ఈ సంఘటన తర్వాత తెలుగు లో సినిమాలు చెయ్యడమే మానేసిందట. ఆ హీరోయిన్ పేరు విచిత్ర. ఈమె పలు పలు సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూ, మధ్యలో క్యారక్టర్ రోల్స్ కూడా చేసేది. అలా నందమూరి బాలకృష్ణ హీరో గా నటించిన ‘భలేవాడివి బాసూ’ చిత్రం లో ముఖ్యమైన పాత్ర పోషించింది.

ఆమె మాట్లాడుతూ ‘2000 సంవత్సరం లో నేను ఒక సినిమా చేశాను. దురదృష్టం కొద్దీ అదే నా చివరి చిత్రం అయ్యింది. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయం లోనే నేను క్యాస్టింగ్ కౌచ్ కి గురి అయ్యాను. ఆ సినిమా హీరో కి నేను ఎవరో కూడా తెలియదు కానీ, నన్ను తన గదిలోకి రమ్మన్నాడు. నేను ఒక్కసారిగా షాక్ కి గురయ్యాను, ఆ తర్వాత నా గదిలోకి వెళ్లి పడుకున్నాను.
గదిలోకి వెళ్లినప్పటి నుండి ఎవరో ఒకరు నా గది తలుపులను నాన్ స్టప్గా కొడుతూనే ఉన్నారు, నాకు చాలా భయం వేసింది, ఎప్పుడెప్పుడు ఈ సినిమా షూటింగ్ అయిపోతుందా అనుకున్నాను. ఈ విషయాన్నీ ఆ చిత్ర డైరెక్టర్ కి చెప్తే అతను సెట్స్ అందరి ముందు నా చంప పగలగొట్టారు’ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ట్రెండ్ అయ్యాయి . దీనిపై బాలయ్య రియాక్ట్ అవుతాడో లేదో చూడాలి.