తెలుగు చిత్ర పరిశ్రమలో మరోసారి డ్రగ్స్ కేసు ప్రకంపనాలు సృష్టిస్తుంది.. కబాలీ తెలుగు నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్‌తో దొరికిపోయాడు. అతనిని విచారించగా పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి..అలాగే కేపీ ఫోన్ కాంటాక్ట్ లిస్టులో వందలాది మంది సినీ తారలు, సెలబ్రిటీల పేర్లు ఉన్నాయి. ముఖ్యంగా బిగ్‌బాస్ ఫేమ్ అషూరెడ్డి, క్యారెక్టర్ ఆర్టిస్టు జ్యోతి, అలాగే సీనియర్ నటి సురేఖావాణిలపై డ్రగ్స్ ఆరోపణలు వస్తున్నాయి.. ఇప్పటికే పలువురు సెలెబ్రేటీలకు అధికారులు నోటీసులు పంపించారు.. ఇంకా కొంతమందికి నోటీసులు పంపనున్నారని సమాచారం..

ఇక సురేఖా వాణితో పాటు ఆమె కూతురు సుప్రీతతో కేపీ చౌదరి దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఒక పార్టీలో సురేఖా కేపీ చౌదరికి ముద్దుపెడుతున్న ఫొటో తెగ వైరలవుతోంది. దీంతో తల్లీకూతుళ్లతో కేపీ చౌదరికి ఉన్న లింక్స్ ఉన్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.. అయితే తల్లికూతుర్లు అతనితో అంత క్లోజ్ గా ఉండటంతో అందరు నిజమే అనుకున్నారు.. అయితే తాజాగా డ్రగ్స్ కేసులో తన పై వస్తున్న ఆరోపణల పై తాజాగా సురేఖ వాణి స్పందించింది..
సోషల్ మీడియా ద్వారా ఓ వీడియోను రిలీజ్ చేసింది.. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట దుమారం రేపుతుంది.. ఆ వీడియోలో సురేఖ వాణి మాట్లాడుతూ..గత కొంతకాలంగా మాపై వస్తున్న ఆరోపణలకు మాకు ఎలాంటి సంబంధం లేదు. దయచేసి మాపై ఆరోపణలు చేయడం ఆపేయండి. మీరు చేస్తున్నఆరోపణల వల్ల మా కెరీర్, మా భవిష్యత్ ముఖ్యంగా నా పిల్లల కెరీర్, ఫ్యూచర్ అలాగే ఫ్యామిలీ ఆరోగ్యం.. ఇలా అన్ని రకాలుగా ఎఫెక్ట్ అవుతోంది. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి. థ్యాంక్యూ’ అని వీడియోలో చెప్పుకొచ్చింది… ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది..