Sreeleela పెళ్లి సందD సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది హీరోయిన్ శ్రీలీల . తొలి చిత్రంతోనే నటనపరంగా ప్రశంసలు అందుకున్న ఈ బ్యూటీ.. ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్లు అందుకుంది. తాజాగా శ్రీలీలకు సంబంధించిన ఓ విషయం నెట్టింట వైరలవుతోంది. ఈ అందాల తార కూడా క్యాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కొందని అంటున్నారు. అందరి హీరోయిన్స్ లాగానే ఈ అమ్మడుకూ క్యాస్టింగ్ కౌచ్ (casting couch)కష్టాలు తప్పలేదు.

సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో ఈ చిన్నది కాస్టింగ్ ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు తెలుస్తోంది.శ్రీలీల కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే.ఆమె కెరియర్ స్టార్టింగ్ లో ఆమెను ఒక కన్నడ డైరెక్టర్ కలిసారట. తనతో చనువుగా ఉంటే తను చెప్పినట్లు చేస్తే మంచి ఆఫర్లు వచ్చేలా చేస్తానని అన్నాడుట. దీనికి శ్రీలీల (Sreeleela) ఒప్పుకోలేదుట. నా టాలెంట్ చూసి నాకు అవకాశం వస్తుందని నమ్మకంగా వచ్చేసింది. కట్ చేస్తే ఇప్పుడు శ్రీలీల ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది.

తొలి సినిమాతోనే అదుర్స్ అనిపించిన ఈ అమ్మడు మాస్ మాహారాజా ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధమాకా చిత్రంలో నటించి అభిమానులను ఫిదా చేసేసింది. తన డ్యాన్స్, డైలాగులతో వావ్ అనిపించుకుంది. ప్రస్తుతం తెలుగు చిత్రపరిశ్రమలో అగ్రకథానాయికలకు పోటీగా చేతి నిండా సినిమాలతో బిజీ అయ్యింది ఈ ముద్దుగుమ్మ. ఇప్పటికే ఆమె రామ్ పోతినేని, నితిన్, వైష్ణవ్ తేజ్.. శర్వానంద్ సినిమాలతో బిజీగా ఉంది. ఇక ఇప్పుడు తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ అందుకున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.