ప్రముఖ స్వర్గీయ నటి సౌందర్య గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా ఆపైచేయం చేయాల్సిన అవసరం లేదు. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన అనతి కాలంలోనే 100 కి పైగా చిత్రాలలో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. సౌందర్య భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆమె నటించిన చిత్రాలు మాత్రం ఇప్పటికీ సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాయి. టాలీవుడ్ లో ఉన్న ప్రముఖ స్టార్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ తో పాటు పలువురు టాప్ హీరోలు అందరి శరాన నటించింది సౌందర్య. ఎక్కడ ఎక్స్ పోజింగ్ కి తావు ఇవ్వకుండా కేవలం నటన తోనే ఎంతో అమంది అభిమానులను సొంతం చేసుకున్నారు సౌందర్య. కానీ అనుకోని రీతిలో హెలికాప్టర్ ప్రమాదంలో అతి చిన్న వయసులోనే మరణించి అభిమానులకు తీవ్ర శోకాన్ని మిగిల్చారు.

ఇక సౌందర్య మరణించి దాదాపు రెండు దశాబ్దాలు అవుతున్నప్పటికీ ఈమె జ్ఞాపకాలను అభిమానులు గుర్తు చేసుకుంటూనే ఉంటారు. తాజాగా సౌందర్య తల్లి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె తన కుమార్తె సౌందర్య కుమారుడు అమర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా సౌందర్య మరణించిన హెలికాప్టర్ ప్రమాదంలోనే ఆమె సోదరుడు అమర్ కూడా మరణించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సౌందర్య తల్లి మాట్లాడుతూ తనకు మనసు బాగా లేకపోయినా తాను ఏదైనా బాధగా ఆలోచిస్తూ పడుకున్న ఆరోజు రాత్రి తన పిల్లలు కలలోకి వస్తారని చెప్పారు.
ముఖ్యంగా నా మనసు బాధగా ఉన్నప్పుడు సౌందర్య కలలోకి తప్పకుండా వస్తారని తెలిపారు. మమ్మీ నీకెందుకు నేను ఉన్నాను కదా అంటుంది అని.. కానీ ఆ కల మధ్యలోనే ఆగిపోతుందని సౌందర్య తల్లి చెప్పుకొచ్చారు. అలా ఎందుకు ఆగిపోతుందో నాకు ఇప్పటికే అర్థం కావడం లేదంటూ వాపోయారు. ఈ విధంగా సౌందర్యాని, ఆమె సోదరుడు అమర్ ని తలుచుకొని వారి తల్లి ఎమోషనల్ అవ్వడం అందరితో కన్నీళ్ళు తెప్పిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.