Actress Satya : వాళ్లంతా క్యారెక్టర్ రాదేమోనన్న భయంతోనే లొంగిపోతారు.. క్యాస్టింగ్ కౌచ్ పై నటి సత్య సంచలన వ్యాఖ్య

- Advertisement -


Actress Satya : సినిమా అనేది రంగుల ప్రపంచం. అందులో ఎదగలంటే ఎన్నో అడ్డంకులు ఎదుర్కోవాల్సిందే. ఏది మంచి ఏది చెడూ అని మనం తీసుకునే నిర్ణయాన్ని బట్టి మన జీవితం ఉంటుందని అంటున్నారు సీనియర్ నటి సత్య కృష్ణన్. దాదాపు 25ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న సత్య కృష్ణన్.. హీరోయిన్‌గానే కాకుండా.. వదిన, అక్క, తల్లి పాత్రల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఆనంద్, బొమ్మరిల్లు, మెంటల్ కృష్ణ.. ఇలా చాలా సినిమాల్లో నటించింది. ఆమెకు నటనతో పాటు హస్కీ వాయిస్ తో చాలామంది ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. దాదాపు మీడియాకి, సోషల్ మీడియాకి దూరంగా ఉండే సత్య.. తాజాగా తన పర్సనల్ విషయాలతో పాటు ఇండస్ట్రీలోని క్యాస్టింగ్ కౌచ్‌పై మాట్లాడారు.

Artist Satya
Artist Satya

‘‘నేను హోటల్ మేనేజ్‌మెంట్ చేశాను. నేను సినిమాల్లోకి రావాలని అనుకోలేదు. జాబ్ చేసే టైంలోనే అనుకోకుండా ఆనంద్ సినిమా ఆఫర్ వచ్చింది. తెలియకుండానే ఒక ఫ్లాట్‌లో ఆడిషన్‌కి వెళ్తే.. సెలెక్ట్ అయ్యానని చెప్పారు. నాకు సినిమాల్లో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేదు. మా ఫ్యామిలీకి సినిమా ఇండస్ట్రీకి సంబంధమే లేదు. మా అమ్మనాన్నలు బ్యాంక్ ఉద్యోగులు. నేను పక్కా తెలంగాణ.

అమ్మనాన్నలది ఆంధ్రాలోని గుంటూరు. కానీ నేను ఇక్కడే పుట్టి పెరిగాను. ఆనంద్ సినిమా లాంటి క్యారెక్టర్‌లు మళ్లీ నాకు పడలేదు. ఆనంద్ సినిమా తరువాత నేను గ్యాప్ తీసుకుని మళ్లీ కెరీర్ స్టార్ట్ చేశాను. అప్పుడే బొమ్మరిల్లు సినిమా వచ్చింది. ఆ తరువాత చాలా సినిమాలు చేశాను కానీ.. పెద్దగా పేరు రాలేదు. బొమ్మరిల్లు అంత పెద్ద హిట్ అయినా కూడా నా పాత్ర చాలా చిన్నది.

- Advertisement -
Artist Satya Updates

పాతికేళ్లుగా ఇండస్ట్రీలో ఉండడమంటే అంత ఈజీ కాదు. ఇప్పటికీ నన్ను జనం గుర్తు పడుతున్నారంటే నేను అదృష్టవంతురాలిని. నా వర్క్ ని నేను ప్రేమిస్తాను.. నాకు మంచి రెస్పెక్ట్ ఇస్తారు. ఇన్నేళ్ల నా కెరియర్‌లో నన్ను ఇబ్బంది పెట్టింది లేదు. విసుక్కోవడాలు.. కసురుకోవడాలు.. తిట్టడాలు.. పడటాలు.. ఇండస్ట్రీలో కామన్. అవేవీ పర్సనల్ గా తీసుకోలేదు. నేను మీతో ఎలా ఉన్నానో.. మీరు నాతో అలా ఉండండి అని చెప్పేస్తా.

ఇండస్ట్రీ అనేసరికి ఆడాళ్లని వాడుకుంటారని అంటారు.. క్యాస్టింగ్ కౌచ్ లాంటిది ఏ ఇండస్ట్రీలో లేదు. సముద్రం అంటే ఉప్పు ఉంటుంది.. నీరూ ఉంటుంది. ఒకటి లేకుండా ఒకటి ఉండదు. ఇదీ అంతే. కానీ మనం ఎలా ఉన్నాం అన్నదే ముఖ్యం. నాకైతే అలాంటి అనుభవం ఎదురుకాలేదు. అలాంటి వైబ్స్ వచ్చినా నా లైన్‌లోకి రాలేదు. క్యాస్టింగ్ కౌచ్.. మీటూ.. ఇవన్నీ ఉమెన్ ఎక్కువ ఫేస్ చేస్తున్నారంటే.. ప్రపంచంలో అందమైన వాళ్లంటే వాళ్లే కదా. ఎవరైనా అందంగా ఉంటే వెంటపడతారు. మనల్ని మనం ఎలా కాపాడుకున్నాం అన్నదే ముఖ్యం. నీ దగ్గరకు ఎవరైనా వచ్చి.. నిన్ను అడిగితే నువ్వు స్ట్రాంగ్‌గా ఉండాలి.. ఆ వ్యక్తి లిమిట్స్ క్రాస్ చేయకుండా చేయాలి. ఈ ధైర్యం ప్రతి అమ్మాయిలో ఉండాలి.

వాడికి లొంగలేదు కాబట్టి.. మనకి క్యారెక్టర్ రాదేమో అని భయపడి లొంగిపోవడం కరెక్ట్ కాదు. అందుకే చాలామంది కెరీర్ గురించి భయపడి వస్తారు. ఇది తప్ప ఇంకొకటి లేదనుకున్న వాళ్లే ఇలాంటి ఒత్తిళ్లకు లొంగుతారు. దీన్ని ఇండస్ట్రీలో అలవాటు చేసుకోవాలి. కానీ ఇది చెప్పడం ఈజీనే కానీ.. ఆ పరిస్థితిలో ఉన్న వాళ్లు ఎంత ఒత్తిడిలో ఉంటారో ఊహించలేం. ఇక్కడ కొంతమందికి క్యారెక్టర్స్ ఉంటాయి.. ఇంకొంతమందికి ఉండవు.. అలాంటి వాళ్ల దగ్గర జాగ్రత్తగా ఉండాలి’ అంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది సత్య.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

   
vps230225.betterwebtechnologies.com telugucinematoday.com