మలయాళి ముద్దుగుమ్మ Samyuktha Menon వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది. ఈ అమ్మడుకు డైరెక్టర్ కార్తీక్ దండు స్టేజ్‌పై మీడియా ముందు అనుకోని షాకిచ్చాడు. దీంతో ఆమెలో తెలియని టెన్షన్ క్రియేట్ అయ్యింది. అయితే ఆమె ఏమీ అనలేక సైలెంట్ అయిపోయింది. తనది గోల్డెన్ లెగ్ కాదని ఐరన్ లెగ్ అని అందరిలో చెప్పారు. అసలు ఏం జరిగింది. సంయుక్తా మీనన్‌ని డైరెక్టర్ కార్తీక్ అంత మాట ఎందుకు అన్నాడంటే..

సాయి ధరమ్ తేజ్, సంయుక్త నటించిన సినిమా ‘విరూపాక్ష’. ఈ సినిమా ఏప్రిల్ 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో సంయుక్తా మీనన్ వరసు సక్సెస్‌లను అందుకుంటుంది. ఆమెను గోల్డెన్ లెగ్ హీరోయిన్ అనుకోవచ్చా? అని అడిగిన ప్రశ్నకు దర్శకుడు కార్తీక్ దండు మాట్లాడుతూ ‘‘మీరేమో గోల్డెన్ లెగ్ హీరోయిన్ అన్నారు. కానీ ఆమె వచ్చిన తర్వాత సాయిధరమ్ తేజ్‌కి యాక్సిడెంట్ అయ్యిందిగా!. అంటే ఆమె గోల్డెన్ లెగ్ అనే అనుకోవద్దు, ఐరన్ లెగ్ అనుకోమంటారా!’’ అని అన్నారు.

హీరోయిన్‌ని గోల్డెన్ లెగ్, ఐరన్ లెగ్ హీరోయిన్ అని అనుకోవద్దు. మంచి స్క్రిప్ట్స్ ఎంచుకుంటూనే ఎవరికైనా సక్సెస్ ఉంటుంది అని చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు కార్తీక్ దండు. అయితే అది రివర్స్ అయినట్లు అనిపించింది. ఆమె వచ్చాకే సాయి ధరమ్ తేజ్ కు యాక్సిడెంట్ అయింది. అన్నట్లు చెప్పినట్లు అయింది. డైరెక్టర్ అలా మాట్లాడటంతో వెంటనే సంయుక్తా మీనన్ షాక్ అయ్యింది. అసలు ఆ టాపిక్ ఎందుకు మాట్లాడటం అని తన అసంతృప్తిని వ్యక్తం చేసేసింది.