Pragathi : సినిమాల్లో క్యారక్టర్ ఆర్టిస్టుగా మంచి డిమాండ్ ని సంపాదించిన నటీమణులలో ఒకరు ప్రగతి. అమ్మ మరియు అక్క క్యారెక్టర్స్ కి పాపులర్ అయిన ప్రగతి ఇప్పటికీ మంచి డిమాండ్ ఉన్న క్యారక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈమె సోషల్ మీడియా ద్వారా కూడా మంచి పాపులారిటీ ని సంపాదించింది. తనకి సంబంధించిన హాట్ ఫోటోలను అప్లోడ్ చేస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది ప్రగతి.
ఇకపోతే రీసెంట్ గా ఆమె ఒక ప్రముఖ స్టార్ నిర్మాతతో రెండవ పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. తెలిసి తెలియని వయస్సు లో పెళ్లి చేసుకొని, ఆ తర్వాత విడాకులు తీసుకున్న ప్రగతి, అప్పటి నుండి ఆమె తన పిల్లలతో కలిసి ఒంటరిగానే జీవితాన్ని గడుపుతుంది. కానీ ఒక వయస్సు వచ్చిన తర్వాత కచ్చితంగా తోడు అనేది అవసరం. ఇది ప్రతీ ఒక్కరికి సాధారణంగా కలిగే ఫీలింగ్.
ఇండస్ట్రీ లో ఎంతో మంది మహిళలు ఇలా రెండవ పెళ్లి చేసుకొని సుఖంగా జీవితం గడుపుతున్నారు. ఇప్పుడు ప్రగతి కూడా అదే బాటలో పయనించనుంది. ఈమె గత కొంత కాలం గా ఒక స్టార్ నిర్మాతతో ప్రేమాయణం నడుపుతూ వస్తుంది అట. వీళ్ళిద్దరూ ప్రస్తుతం డేటింగ్ లో కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఆ నిర్మాత ఇప్పటి వరకు బడా స్టార్స్ తో పలు సూపర్ హిట్ సినిమాలను కూడా నిర్మించాడు.
అలాంటి నిర్మాతతో ప్రగతి కి పెళ్లి జరగబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కొన్నాళ్ల క్రితమే సింగర్ సునీత కూడా ఇలాగే రెండవ పెళ్లి చేసుకొని సుఖంగా జీవనం సాగిస్తుంది. మరోపక్క రేణు దేశాయ్ కూడా అతి త్వరలోనే రెండవ పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ రీసెంట్ ఇంటర్వ్యూస్ లో ఖరారు చేసింది. ఈ వార్త వచ్చిన రెండవ రోజే ప్రగతి కూడా రెండవ పెళ్లి చేసుకోబోతుంది అంటూ సోషల్ మీడియా మొత్తం కోడై కూస్తుంది. మరి ఇందులో ఎంత మాత్రం నిజం ఉంది అనేది ప్రగతి ఖరారు చేసి చెప్పాలి.