ఒకానొక సమయంలో తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్గా నటించి ఓ వెలుగు వెలిగింది హీరోయిన్ నిరోషా. ఈమె రాధిక కు సోదరి. నిరోషా ఒకప్పుడు ఒక వెలుగు వెలిగి హీరోయిన్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కొంతకాలనే ఇండస్ట్రీకి దూరమయింది. చాలా కాలం తర్వాత మళ్లీ ఇప్పుడు రీ ఎంట్రీ ఇవ్వబోతున్నందుకు ఆమె అభిమానులు ఎంతగానో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఈమె ఇప్పుడు కోలీవుడ్ స్టార్ రజినీకాంత్ తో లాల్ సలాం చిత్రంలో నటించబోతోందట. ఈ సినిమాకు రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్య దర్శకురాలిగా వ్యవహరిస్తోంది. ఈ చిత్రాన్ని లైకా నిర్మాణ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి ఈ సినిమాలో విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా నటిస్తున్నారు.ఈ సినిమాలో రజనీకాంత్ ఒక ముస్లిం వ్యక్తి పాత్రలో నటించబోతున్నారని తెలుస్తోంది. ఈ పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉండబోతుందని ఈ పాత్ర ద్వారా మొత్తం సినిమా మలుపు తిరగబోతుందని తెలుస్తోంది.
ఈ సినిమా ద్వారానే సీనియర్ నటి నిరోషా తిరిగి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతోంది. దాదాపుగా ఎన్నో సంవత్సరాల తర్వాత తిరిగి నిరోష ఎంట్రీ ఇవ్వబోతోంది. నిరోషా ఈ సినిమాలో రజనీకాంత్ కి చెల్లెలు పాత్రలో నటించబోతోందని సమాచారం. కానీ పలువురు నెటిజెన్లు రజనీకాంత్ కు జోడిగా నటించబోతుందేమో అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో మనకు తెలియాల్సి ఉంది. అప్పట్లో కూడా అగ్ర హీరోలతో నటించిన నిరోషా ఇప్పటికీ కూడా కోలీవుడ్ హీరో రజనీకాంత్ తో నటించడంతో ఈమె కెరియర్ ఏ విధంగా మలుపు తిరుగుతుందో చూడాలి మరి. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.