Actress Meena : టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ మీనా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ పలు సినిమాల్లో హీరోయిన్‌గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన మీనాకు ఇప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. తన అందం, అభినయంతో కోట్లాది మంది ప్రేక్షకులను ఆకట్టుకున్న మీనా ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. కెరీర్ సంగతి పక్కన పెడితే.. గతేడాది మీనా భర్తను పోగొట్టుకున్న సంగతి తెలిసిందే.
భర్త చనిపోయిన రెండు, మూడు నెలల తర్వాత మీనా తన బిడ్డ కోసం రెండో పెళ్లి చేసుకోబోతుందంటూ సోషల్ మీడియాలో చాలా వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మీనా తన రెండో పెళ్లిపై స్పందించింది. నేను హీరోయిన్‌గా ఉన్న రోజుల్లో గ్లామర్ పాత్రలకు హద్దులుండేవని.. ఇప్పుడు హీరోయిన్లుగా నటిస్తున్న ప్రతి ఒక్కరు నటించే రోల్స్ లలో గ్లామర్ హద్దు మీరే ఉంటున్నాయి. నా భర్త మరణానంతరం చాలా మంది ఎన్నో రకాల వార్తలు రాశారు.
నేను ధనుష్‌ని రెండో పెళ్లి చేసుకోబోతున్నాను, రాజకీయ నాయకుడిని పెళ్లి చేసుకోబోతున్నాను, వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ చాలా రకాల వార్తలు నాపై ప్రచురితమయ్యాయి. దీనిపై ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చినా ఈ వార్తలు ఆగడం లేదు, నా భర్త మరణానికి ముందు అతనితో నాకు ఏదో గొడవలు ఉన్నాయని కూడా ప్రచారం చేశారు. ఇలాంటి వార్తలు రాసే ముందు మా కుటుంబం గురించి కూడా కొంచెం ఆలోచించాలన్నారు మీనా. మీనా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో మీనా అభిమానులు ఇప్పుడు డోంట్ వర్రీ మేడమ్..అవన్నీ పుకార్లు.. వాటిని ఎవరు పట్టించుకోరు అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.