Kushboo : దక్షిణాది చిత్రపరిశ్రమలో ఒకప్పుడు అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలిగిన హీరోయిన్లలో ఖుష్బూ ఒకరు. తెలుగుతోపాటు.. తమిళంలోనూ ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. అత్యంత ఎక్కువ సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్న హీరోయిన్ ఆమెనే. అప్పట్లోనే ఆమెకు తమిళనాడులో గుడి కట్టారంటే అర్థం చేసుకోవచ్చు ఆమె అందానికి ఎంతగా ఆరాధిస్తున్నారో.

తాజాగా ఆమె గొపిచంద్ రామబాణం సినిమాలో నటించారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కుష్బూ మాట్లాడుతూ ఆమెకు ఇష్టమైన హీరోల గురించి చెప్పారు. ఓ హిందీ సినిమా చూసి నన్ను సెలక్ట్ చేయమని వెంకీ చెప్పారట. అది నా అదృష్టం. కె. రాఘవేంద్రరావు, జంధ్యాల, భారతిరాజా, బాలచందర్… ఇలా గొప్ప దర్శకులతో పనిచేసే అవకాశం కలిగింది. నేను మద్రాసులో ఉన్న సమయంలో తెలుగు నుంచి ఎక్కువగానే అవకాశాలు వచ్చినా చేయలేకపోయాను. అలా చంటి సినిమాను కూడా వదిలేసుకోవాల్సి వచ్చిందని కుష్బూ చెప్పారు.

ఇక తాను ఇప్పటి వరకూ చిరంజీవి, బాలయ్యలతో నటించలేదని వాళ్లతో కలిసి నటించే అవకాశం వస్తే ఇప్పుడైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాని చెప్పారు. అమితాబ్ బచ్చన్ తోనూ కలిసి నటించాలని ఉండేది. బాలనటిగా ఆయనతో కలిసి నటించాను. నా అభిమాన నటుడు ఆయన ఫోటోస్ ఇప్పటికీ నా బెడ్ రూమ్ లో ఉంటాయి అని కుష్బూ చెప్పారు. ప్రస్తుతం గోపిచంద్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన రామబాణం సినిమాలో ఆమె కీలకపాత్రలో నటించారు. ఈ మూవీ వచ్చే నెల 5న ఆడియన్స్ ముందుకు రాబోతుంది.