ఈ మధ్యకాలంలో హీరోలపై నటీమణులు ఓపెన్ గా కామెంట్స్ చేస్తున్నారు. స్టార్ హీరోలను ఏదో ఒక మాట అనేసి చటుక్కున వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా యువ నటి ఇందు విషయంలో అదే జరిగింది. ప్రభాస్ పై ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట్లో ట్రెండ్ అవుతున్నాయి. ఓ ఇంటర్వ్యూలో భాగంగా ప్రభాస్ గురించి తన మనసులో మాట బయటపెట్టింది. ప్రస్తుతం చిన్న చిన్న పాత్రలు చేస్తూ వస్తున్న ఇందును ప్రభాస్ పక్కన చెల్లిగా, చెల్లి పాత్రలో డైలాగ్స్ చెప్పాల్సి వస్తే.. నటిస్తారా? అని యాంకర్ అడగడంతో బోల్డ్ గా సమాధానం చెప్పి షాకిచ్చింది ఇందు.
ఆన్ స్క్రీన్‌లో అయితే ప్రభాస్ చెల్లిగా చేస్తా.. అదే ఆఫ్ స్క్రీన్‌లో ప్రభాస్‌ని రేప్ చేస్తా అని ఇందు చెప్పింది. నిజానికి ఇది ఓల్డ్ వీడియోనే అయినా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందు కెరీర్ విషయానికొస్తే.. ఇప్పటికే చాలా సినిమాల్లో సైడ్ రోల్స్ చేసింది. బుట్టబొమ్మ, మెరిసే మెరిసే సినిమాల్లో కనిపించింది. రాజా రాజా చోర, గాలివాన వెబ్ సిరీస్ ఇలా చాలా ప్రాజెక్టుల్లోనే భాగమైంది. అయితే ప్రభాస్ పై చేసిన కామెంట్స్ తో ఒక్కసారిగా అమ్మడి పేరు నెట్టింట మారుమోగుతోంది.
ఇక ప్రభాస్ పెళ్లి అనేది సోషల్ మీడియాలో నిత్యం హాట్ టాపికే. పాన్ ఇండియా స్టార్ పైగా టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కావడంతో ఆయన పెళ్లి విషయమై గత కొన్నేళ్లుగా బోలెడంత చర్చ నడుస్తోంది. ఆయన పెళ్లిపై బోడాన్ని రూమర్లు కూడా షికారు చేశాయి. అంతకుముందు అనుష్కతో లవ్ ట్రాక్ నడిపిస్తున్నట్లు ప్రచారం జరగ్గా.. మొన్నటికి మొన్న బాలీవుడ్ బ్యూటీ, ఆదిపురుష్ హీరోయిన్ కృతి సనన్ తో సీక్రెట్ రిలేషన్ నడుపుతున్నారనే విషయం జనాల్లో చర్చనీయాంశం అయింది.