Disha Patani దిశా పటానీ.. ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో లోఫర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. వరుణ్ తేజ్ తో కలిసి నటించింది. ఆ తర్వాత బీ టౌన్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది. ఇటీవలే ప్రభాస్ తో కలిసి కల్కి మూవీలో సందడి చేసి మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించింది. దిశా ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉంది.
దిశా పటానీ తన సినిమాల కంటే ఎక్కువగా ఫిట్ నెస్ కు పాపులర్. ఈ బ్యూటీ ఫిట్ నెస్ ముందు అబ్బాయిల సిక్స్ ప్యాక్ బాడీ కూడా దిగ దుడుపే. ఇక ఈ భామ మార్షల్ ఆర్ట్స్ లోనూ ఆరితేరింది. ఇక సోషల్ మీడియాలో దిశ చేసే సందడి అంతా ఇంతా కాదు. తరచూ హాట్ పిక్స్ పోస్టు చేస్తూ నెటిజన్లకు నిద్ర లేకుండా చేస్తుంది. తాజాగా దిశ మరోసారి తన సొగసుల బాంబ్ ను నెట్టింట విసిరేసింది.
తాజాగా దిశా పటానీ తన లేటెస్ట్ మిర్రర్ సెల్ఫీని పోస్టు చేసింది. అయితే ఈ ఫొటోలు దిశా ముఖం మాత్రం కనిపించడం లేదు. తన నడుం వొంపులు చూపిస్తూ ఈ బ్యూటీ పోజులు ఇచ్చింది. ఇక అంతకుముందు బీచ్ లో తన సొగసులను చూపించింది. ఈ బ్యూటీకి బీచ్ అంటే ఎంత ఇష్టమో తెలిసిందే. బీచ్ లో టూ పీస్ బికినీలో దిశా ఫొటోషూట్ అదిరిపోయింది. ప్రస్తుతం ఈ ఫొటోలు బాగా వైరల్ అవుతున్నాయి.
ఇక దిశ సినిమాల సంగతికి వస్తే ఇటీవలే కల్కి మూవీలో సందడి చేసింది. ఇక ఈ భామ హిందీలో వెల్ కమ్ టు ది జంగిల్, మలంగ్-2 సినిమాలు చేస్తోంది. తమిళంలోనూ ఈ భామ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయింది. సూర్యతో కలిసి కంగువా చిత్రంలో జత కడుతోంది. మరోవైపు సంఘమిత్ర అనే చిత్రంలోనూ నటిస్తోంది.