తెలుగు నిర్మాతలకు హీరోయిన్ ఆ పొజిషన్ లో ఉండాలి.. బోల్డ్ కామెంట్స్ చేసిన స్టార్ హీరోయిన్

- Advertisement -

ఐశ్వర్య రాజేష్.. ఈ పేరు సినీ ప్రియులకు పరిచయం అవసరం లేదు. తాజాగా ఈ అమ్మడు చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. తన తండ్రి తెలుగులో 40 సినిమాలు చేశారని, కానీ నువ్వెందుకు తెలుగులో చేయట్లేదని తన తండ్రి ఎప్పుడూ అడుగుతూ ఉంటుందన్నారు. కానీ తాను మాత్రం తెలుగులో చేస్తే.. మాములుగా చేయకూడదనుకున్నానని వెల్లడించారు. తాను సీనియర్ ఎన్టీఆర్ గారికి పెద్ద ఫ్యాన్ అని.. కాబట్టి తాను తెలుగులోకి వెళ్తే బ్లాక్ బస్టర్తోనే వెళ్లానని నిశ్చయించుకున్నట్టు ఆమె తెలిపారు. అలా ఎదురుచూస్తుండగానే తనకు ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ద్వారా మంచి అవకాశం వచ్చిందన్నారు. ఆ తర్వాత ‘కౌసల్య క్రిష్ణమూర్తి’ రిమేక్ ఇక్కడ చేశామని తెలిపారు.

ఐశ్వర్య రాజేష్
ఐశ్వర్య రాజేష్

తెలుగులో నేరుగా ‘టక్ జగదీష్‘, ‘రిపబ్లిక్’ సినిమాల్లో నటించానని తెలిపారు. అయితే తమిళ సినిమాల్లో తాను దాదాపు సెంట్రిక్ ఫిమేల్ క్యారెక్టర్ లో చేశానని.. దీనిపైనా తన తల్లి ప్రశ్నించేదని.. ఎందుకు తెలుగు సినిమాల్లో సెంట్రిక్ ఫిమేల్ క్యారెక్టర్స్ లో చేయవని అడిగినట్టు ఆమె గుర్తు చేసుకున్నారు. తాను అప్పుడు కూడా అదే సమాధానమిచ్చానని, తెలుగు సినిమాల్లో ఆ క్యారెక్టర్స్ లో చేయాలంటే స్టార్ పొజిషన్ ఉండాలని చెప్పినట్టు ఐశ్వర్య రాజేష్ అన్నారు. అలా స్టార్ పొజిషనల్ లో ఉంటేనే చిన్న పాత్ర అయినా ఇస్తారని లేదంటే ఇవ్వరని బోల్డ్ కామెంట్స్ చేసింది. కానీ తెలుగు బిడ్డనైనా.. తనకు పెద్ద క్యారెక్టర్స్, పెద్ద సినిమాల్లో అవకాశం చాలా తక్కువగానే వచ్చాయని తెలిపారు.

తెలుగు సినిమాల గురించి ప్రస్తావించిన ఐశ్వర్య రాజేష్.. ప్రతి ఒక్కరూ తనను మాటిమాటికీ అడిగే ప్రశ్న.. ఏ సినీ ఇండస్ట్రీ సినిమాను సెలబ్రేట్ చేస్తుంది అని.. ఈ ప్రశ్నకు తాను భయపడకుండా సమాధానం చెప్తానని.. అది తెలుగు ఇండస్ట్రీనేనని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆడియెన్స్ కూడా చాలా తెలివిగా మారిపోయారని.. రూ.4-500 కోట్లు పెట్టి సినిమా తీస్తే.. సినిమాలో కంటెంట్ లేకపోతే ఆడట్లేదన్న విషయం అందరికీ తెలిసిందేనని చెప్పారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here