Adah Sharma : అందాల ముద్దుగుమ్మ ఆదాశర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 2008లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ‘1920’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయింది. పునీత్ రాజ్‌కుమార్‌తో ‘రణ విక్రమ’ చిత్రంలో నటించింది. తెలుగులో పూరిజగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన హార్ట్ ఎటాక్ సినిమా ద్వారా పరిచయం అయ్యింది. ఈ సినిమా అంతగా ఆకట్టుకోకపోయినా అదా శర్మ నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. ఈరోజు (మే 11) ఈ క్యూటీ పుట్టినరోజు. అందరూ అదా శర్మకు అభినందనలు తెలుపుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆమె అభిమానులు, సినీ సెలబ్రెటీలు అదా శర్మకు విషెస్ తెలుపుతున్నారు.
‘ది కేరళ స్టోరీ’ సినిమా ద్వారా క్యూట్ బ్యూటీ అదా శర్మకు మంచి పాపులారిటీ వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. అదా శర్మ నటనను కొనసాగించడం కోసం చదువును కూడా పక్కన పెట్టింది. ముందుగా ఆమె జిమ్నాస్టిక్స్ నేర్చుకోవాలని అనుకుంది. ఆ తర్వాత నటనపై ఆసక్తితో సెకండరీ పీయూసీ పూర్తి చేసి ఆ తర్వాత ఇండస్ట్రీలోకి వచ్చింది. అదా శర్మ మూడేళ్ల వయసులోనే నాట్యం నేర్చుకుంది. తర్వాత గోపీకృష్ణ డాన్స్ అకాడమీలో చేరింది. అమెరికాలో శిక్షణ పొందింది. ఆమె జిమ్నాస్టిక్స్‌లో కూడా శిక్షణ పొందింది.
ది కేరళ స్టోరీ సినిమాతో అదా శర్మ పాన్ ఇండియా హీరోయిన్ గా మారింది. ఈ సినిమా విడుదలకు ముందు ఎన్నో వివాదాలు ఎదుర్కొన్నా విడుదలై సంచలన విజయం సాధించింది. దాంతో అప్పటి నుంచి ఆదాశర్మ కాంట్రవర్సల్ స్టోరీలపైనే ఫోకస్ పెట్టింది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో నిత్యం యాక్టీవ్ గా ఉంటూ వరుస పోస్టులతో ఆకట్టుకుంటుంది. తాజాగా తాను షేర్ చేసిన వీడియో బాగా వైరల్ అవుతుంది. ఆ వీడియోలో అదా శర్మ ఇలా రాసుకొచ్చింది. క్షమించండి , నేను మీ మెసేజ్ లకు ఆన్సర్ ఇవ్వలేదు. ఎందుకంటే పాపి కుక్క పిల్ల నా వేళ్లు తినేసింది. దీనితో నేను మీకు జవాబు ఇవ్వలేకపోతున్నాను. ఆ సమయంలో విజిల్ వేస్తూ అదా శర్మ అలరించింది. విజిల్ తో ఒక సాంగ్ పాడింది. ఇంతకీ ఆ సాంగ్ ఏంటో గుర్తించండి అని అదా ఫజిల్ ఇచ్చింది. వాస్తవానికి అదా శర్మకు జంతువులంటే చాలా ఇష్టం. వీధికుక్కలను దత్తత తీసుకోవాలని తన అభిమానులను తరచూ కోరుతూ ఉంటుంది.
View this post on Instagram