Actor Suman : హీరో గా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్టు లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి స్టార్ గా ఎదిగిన నటులలో ఒకరు సుమన్. కృష్ణ, శోభన్ బాబు యుగం ముగుస్తున్న తరుణంలో, చిరంజీవి యుగం ప్రారంభమైన కొత్త రోజుల్లో, ఆయనతో సమానంగా స్టార్ స్టేటస్ ని సంపాదించుకున్న ఏకైక నటుడు ఆయన. యాక్టింగ్ లో కానీ, డ్యాన్స్ లో కానీ, ఫైట్ లో కానీ ఇలా అన్నిట్లో అప్పట్లో సుమన్ మరియు చిరంజీవి మధ్య విపరీతమైన పోటీ ఉండేది. ఆ తర్వాత సుమన్ కొన్ని అనుకోని కేసుల్లో చిక్కుకోవడం, జైలుకు పోవడం వల్ల అతని కెరీర్ నాశనం అయ్యింది. రీ ఎంట్రీ తర్వాత హీరో గా ఒకటి రెండు హిట్లు పడినప్పటికీ కూడా అవి ఆయనకీ స్థిరమైన మార్కెట్ ని ఏర్పాటు చేయలేకపోయాయి.

ఇక అప్పటి నుండి క్యారక్టర్ ఆర్టిస్టుగా మారిన సుమన్ కి తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడం లో ఎన్నో అవకాశాలు వచ్చాయి. ఒక్క మాటలో చెప్పాలంటే పాన్ ఇండియా లెవెల్ లో మోస్ట్ డిమాండ్ ఉన్న అతి తక్కువమంది ఆర్టిస్టులతో ఒకరిగా మారారు సుమన్. అయితే సుమన్ లో ఉన్న మరో గొప్ప లక్షణం ఏమిటంటే, మనసులో ఉన్న మాటల్ని ఎలాంటి ఫిల్టర్ లేకుండా ఎదుటి వ్యక్తి ముఖం మీద చెప్పే తత్త్వం ఉండడమే. అందుకే రీసెంట్ గా ఆయన కమల్ హాసన్ గురించి కూడా అదే తరహా కామెంట్స్ చేసాడు. అవి ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.
ఆయన మాట్లాడుతూ ‘నాకు ఎంతగానో ఇష్టమైన నటుడు కమల్ హాసన్. అతనిలో ఒక రొమాంటిక్ నటుడు కూడా ఉన్నాడు. ఆరోజుల్లో ఆయన డ్రెస్సింగ్ స్టైల్ చాలా కొత్తగా ఉండేది, యూత్ అప్పట్లో తెగ అనుసరించేవారు. ఆయన షూటింగ్ లో రొమాన్స్ కి సంబంధించిన షాట్స్ ని చాలా న్యాచురల్ గా చేసేవాడు. కథ డిమాండ్ చేస్తే కన్నా కూతురు శృతి హాసన్ తో ఆయన రొమాన్స్ చెయ్యగలడు’ అంటూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు పెద్ద చర్చకి దారి తీసింది. దీనిపై సోషల్ మీడియా లో కమల్ హాసన్ అభిమానులు కాంతామణి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.