Actor Sriram : తమిళం లో ఒకప్పుడు యంగ్ హీరో గా మంచి పేరు తెచ్చుకున్న నటుడు శ్రీరామ్. ఇతనికి అప్పట్లో తమిళం లో చాలా సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. యూత్ ని టార్గెట్ చేస్తూ ఆయన సినిమాలు చేసేవాడు. మన టాలీవుడ్ ఆడియన్స్ కి రోజాపూలు అనే చిత్రం ద్వారా పరిచయం అయ్యాడు. భూమిక హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం ఇక్కడ పెద్ద హిట్ అయ్యింది.

ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు కూడా బాగా ఫేమస్ అయ్యాయి. ఆ తర్వాత ఇతను హీరో గా నటించిన పలు తమిళ సినిమాలు తెలుగు లో విడుదల అయ్యాయి కానీ, పెద్దగా ఆకట్టుకోలేదు. హీరో గా కంటే ఎక్కువగా ఆయన క్యారక్టర్ ఆర్టిస్టుగానే కొనసాగాడు. ఇది ఇలా ఉండగా రీసెంట్ గా ఆయన పిండం అనే చిత్రం లో నటించాడు. అతి త్వరలో విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకి సంబంధించి ప్రొమోషన్స్ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు శ్రీరామ్.

ఈ సందర్భంగా ఆయన నాగచైతన్య తో కలిసి పనిచేసిన అనుభూతిని మీడియా తో పంచుకున్నారు. వీళ్లిద్దరు కలిసి ‘దడ’ అనే చిత్రం లో నటించారు. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ సమయం లో జరిగిన ఒక సంఘటన గురించి చెప్పుకొచ్చాడు శ్రీరామ్.

ఆయన మాట్లాడుతూ ‘ఒక యాక్షన్ సన్నివేశం కోసం ఉదయం షూటింగ్ మొదలు పెడితే మధ్యాహ్నం 1:30 అయ్యింది. దాదాపుగా 28 టేకులు తీసుకున్నాను ఆ సన్నివేశం చెయ్యడానికి. అందులో ఆరవ టేక్ 40 అడుగుల ఎత్తులో ఉన్న ఒక భవనం లో ఆరవ ఫ్లోర్ నుండి మరో బిల్డింగ్ పైకి దూకాలి. క్రింద వాహనాలు వెళ్తున్నాయి, పొరపాటున నేను జారిపడితే స్పాట్ లో చనిపోతాను. ఎలాంటి బెడ్స్ కానీ, వైర్లు కానీ ఉపయోగించలేదు. సొంతంగా రిస్క్ చేసి దూకాను,అంత కష్టపడి చేసిన సన్నివేశం ని సినిమా నుండి తొలగించేసారు.ఆ సినిమా పెద్ద ఫ్లాప్ అయ్యింది, నా కెరీర్ మీద ప్రాభవం చూపింది’ అంటూ చెప్పుకొచ్చాడు.