Actor Prabhas : ప్రభాస్ హీరోగా నటిస్తోన్న పాన్ ఇండియా సినిమా ఆదిపురుష్ (Adipurush). ఈ సినిమాను వివాదాలు వదలడం లేదు. తాజాగా శ్రీరామనవమి సందర్భంగా రిలీజైన ఈ మూవీ కొత్త పోస్టర్‌పై పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చాయి. టీజర్ రిలీజ్‌కు ,పోస్టర్ రిలీజ్లకు ముందు వరకు ‘ఆదిపురుష్’పై ఉన్న అంచనాలు.. ఆ తర్వాత అమాంతం పోయాయి. టీజర్‌పై వచ్చిన ట్రోల్స్ చూసిన తర్వాత సినిమా విడుదలను వాయిదా వేశారు మేకర్స్. జూన్‌లో విడుదల చేస్తామని చెప్పి.. గ్రాఫిక్ వర్క్ మొదలుపెట్టారు.ప్రభాస్ హీరోగా నటిస్తోన్న పాన్ ఇండియా సినిమా ఆదిపురుష్ (Adipurush). ఈ సినిమాను వివాదాలు వదలడం లేదు. తాజాగా శ్రీరామనవమి సందర్భంగా రిలీజైన ఈ మూవీ కొత్త పోస్టర్‌పై పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చాయి. టీజర్ రిలీజ్‌కు ,పోస్టర్ రిలీజ్లకు ముందు వరకు ‘ఆదిపురుష్’పై ఉన్న అంచనాలు.. ఆ తర్వాత అమాంతం పోయాయి. టీజర్‌పై వచ్చిన ట్రోల్స్ చూసిన తర్వాత సినిమా విడుదలను వాయిదా వేశారు మేకర్స్. జూన్‌లో విడుదల చేస్తామని చెప్పి.. గ్రాఫిక్ వర్క్ మొదలుపెట్టారు.

శ్రీరామనవమి సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ విషయంలో కొందరు పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కారని సమాచారం. ఓ ప్రముఖ మతం మనోభావాలు దెబ్బతీసేలా పోస్టర్ ఉందని ఫిర్యాదు చేశారట. ఆ పోస్టర్లో సీతమ్మ తల్లి మెడలో తాళి, ఆభరణాలు లేకపోవడం, కాళ్లకు మెట్టెలు లేకపోవడం, లక్ష్మణుడికి పూర్తిగా గడ్డం ఉండటంతో వీటి పైన కూడా ట్రోల్స్ చేస్తున్నారు. పోస్టర్ రియలిస్టిక్‌గా లేదని మళ్లీ గ్రాఫిక్స్ ఉన్నాయని.. దీనికంటే ఫ్యాన్స్ చేసిన పోస్టర్లే బాగున్నాయంటూ నెటిజన్స్ విమర్శిస్తున్నారు. టాలీవుడ్ సినీ అభిమానులతో పాటు బాలీవుడ్ (bollywood) మూవీ ఫ్యాన్స్ కూడా ‘రామాయణం గురించి తెలుసా?’ అంటూ ఓం రౌత్‌ను ట్రోల్ చేస్తున్నారు. రిలీజ్‌కు ముందే ఇంతగా ట్రోల్ అవుతున్న ‘ఆదిపురుష్’ విడుదల తర్వాత ఏమవుతుందో చూడాలి.

బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్లో.. ప్రభాస్ హీరోగా తెరకెక్కతున్న ఇండియన్ మైతలాజికల్ ఫిల్మ్ ఆదిపురుష్. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈసినిమా రామాయణ ఇతివృత్తంతో.. మోషన్ క్యాప్చర్ టెక్నాలిజీతో రూపొందుతోంది. జూన్ 16 న రిలీజ్‌కు కూడా రెడీ అయిపోయింది.తాజాగా ముంబైకి చెందిన ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో.. పోలీసులు ఈ మూవీ మేకర్స్ పై కేసు కూడా నమోదు చేశారట.. ఇప్పడు అంతటా ఆదిపురుష్ మరో హాట్ టాపిక్ గా మారింది.