Ponnambalam : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి ని కెరీర్ పరంగా ఆదర్శంగా తీసుకుంటే గొప్ప స్థాయికి చేరుకుంటారని అందరూ అంటూ ఉంటారు. కేవలం కెరీర్ పరంగా మాత్రమే కాదు, ఆయనలోని గొప్ప లక్షణాలను , సేవ చేసే తత్వాన్ని స్ఫూర్తి గా తీసుకుంటే గొప్ప మనుషులుగా కూడా నిలుస్తారని ఇండస్ట్రీ లో ఉండే కొంతమంది ప్రముఖులు ఎన్నో సందర్భాలలో తెలిపారు. ఆయన చేసినన్ని సహాయాలు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ఎవ్వరూ కూడా చేసి ఉండరు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.

మనకి మరియు మీడియా కి తెలిసినవి కొన్ని మాత్రమే, కానీ తెలియకుండా ఆయన చేసిన గుప్త దానాలు, పెద్ద దానాలు గురించి సహాయం పొందిన వాళ్ళు చెప్తే కానీ మనకి తెలియదు. రీసెంట్ గా ప్రముఖ తమిళ నటుడు ‘పొన్నాంబళం’ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో మెగాస్టార్ చేసిన గొప్ప సహాయం గురించి చెప్పుకుంటూ ఎమోషనల్ అయ్యాడు.

ఆయన మాట్లాడుతూ ‘నమ్మి దగ్గరకి చేరదీస్తే నా తమ్ముడు నాకు వెన్నుపోటు పొడిచాడు. మా నాన్న కి నలుగురు భార్యలు, మూడవ భార్య కొడుకుని నేను నా సొంత తమ్ముడిలాగా చూసుకున్నాను. వాడిని నేను ఎంతగానో నమ్మాను, కానీ నేను తాగే మందు సీసాలో ‘స్లో పాయిజన్’ ఇస్తూ ఉండేవాడు. దానికి తోడు తినే అన్నం లో కూడా విష పదార్దాలు కలిపేవాడు,అవన్నీ తినడం వల్లే నా కిడ్నీలు చెడిపోయాయి. చావుని చాలా దగ్గరగా చూసి బయటపడ్డాను, ఈరోజు నేను మీ ముందు ఇలా ఉన్నాను అంటే దానికి కారణం మెగాస్టార్ చిరంజీవి.

నేను హాస్పిటల్ లో ప్రాణాంతక స్థితిలో ఉన్న సమయం లో నా చికిత్స కి అవసరం అయ్యే డబ్బులను ఎవరిని అడగాలో తెలియక చిరంజీవి గారిని అడిగాను, ఎదో లక్షా లేదా రెండు లక్షలు సహాయం చేస్తాడని అనుకున్నాను, కానీ ఆయన సమీపం లో ఉన్న అపోలో హాస్పిటల్ కి వెళ్ళమని చెప్పి , నా చికిత్స కి అవసరమైన 45 లక్షల బిల్లుని చిరంజీవి గారే కట్టారు’ అంటూ నటుడు పొన్నాంబళం చెప్పిన మాటలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.