Actor Nani : ప్రస్తుతం ఉన్న పోటీ వాతావరణం లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ కి వచ్చి సక్సెస్ అవ్వడం అనేది చిన్న విషయం కాదు. అప్పట్లో తక్కువ హీరోలు ఉండేవారు కాబట్టి బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా కూడా సక్సెస్ అయ్యే వారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఇలాంటి పోటీ వాతావరణం లో కూడా ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ని ప్రారంభించి, ఆ తర్వాత హీరో గా మారి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకొని నేడు వంద కోట్ల హీరోగా నిలిచాడు న్యాచురల్ స్టార్ నాని.
ఈ ఏడాది ప్రారంభం లో ఆయన ‘దసరా’ చిత్రం తో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి వంద కోట్ల రూపాయిల గ్రాస్ క్లబ్ లోకి చేరగా, సెకండ్ హాఫ్ లో ‘హాయ్ నాన్న’ చిత్రం తో మరో సూపర్ హిట్ కొట్టి తన సత్తా చాటాడు. అయితే నాని గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి.
అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు నాని ఎంతో మంది టాప్ డైరెక్టర్స్ క్రింద పని చేసాడు అనే విషయం మన అందరికీ తెలుసు. రాఘవేంద్ర రావు, కృష్ణ వంశీ, మణి రత్నం ఇలా ఒక్కరా ఇద్దరా ఎంతో మంది డైరెక్టర్స్ వద్ద ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసాడు. కానీ ఒక సీరియల్ కి కూడా నాని కొన్ని ఎపిసోడ్స్ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసాడు అనే విషయం ఎవరికీ తెలియదు.
మన చిన్న తనం లో మధురమైన జ్ఞాపకంగా నిలిచింది ‘అమృతం’ అనే కామెడీ సీరియల్. ఇప్పటికీ కూడా ఈ సీరియల్ ని మనం ఇంటర్నెట్ లో చూస్తూనే ఉంటాం. ఎన్ని సార్లు చూసిన బోర్ కొట్టని ఎపిసోడ్స్ అవి. అయితే కొన్ని ఎపిసోడ్స్ కి గోపీ కసిరెడ్డి అనే డైరెక్టర్ క్రింద ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసాడట నాని. ఈ విషయం చాలా మందికి తెలియదు, సుమారుగా నాలుగు నుండి 9 ఎపిసోడ్స్ వరకు నాని ఈ సీరియల్ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసాడట.