పెళ్లి చేసుకుని వెళ్లిపోయి.. మూడురోజులకు తిరిగొచ్చిన నటుడు

- Advertisement -

ఆయన ఉంటే సినిమా కచ్చితంగా హిట్టే అనే స్థాయి నటుడు. తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు బ్రహ్మాజీ (Actor Brahmaji). కథానాయకుడిగా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. అగ్ర హీరోలతో పాటు, నేటి యువ హీరోలతోనూ తెరను పంచుకున్నారు. తాజాగా టీవీలో ప్రసారమయ్యే ఓ షోకు తన సతీమణి శాశ్వతితో కలిసి వచ్చారు. అందులో ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

బ్రహ్మాజీ
బ్రహ్మాజీ

అందులో వాళ్ల పెళ్లి గురించి చెప్పిన బ్రహ్మాజీ ఇంట్లోంచి పారిపోయి పెళ్లిచేసుకున్నట్లు చెప్పాడు. మేము పెళ్లి చేసుకున్న విషయం మా ఇళ్లలో తొలుత తెలియదు. కృష్ణవంశీ, రమ్యకృష్ణలే మా పెళ్లి చేశారు. నా తరపున గంగరాజుగారు, ఆమె తరపున జగపతిబాబు సోదరుడు రాం ప్రసాద్‌ పెళ్లికి వచ్చారు. కృష్ణవంశీ కన్యాదానం చేశాడు. కోఠిలోని ఆర్య సమాజ్‌లో మా వివాహం జరిగింది. అదే సమయంలో ‘చంద్రలేఖ’ షూటింగ్‌ జరుగుతుండటంతో అందరూ ఉదయం 8 గంటలకే వచ్చేశారు. నాగార్జున కూడా రావాలి కానీ, కుదరలేదు అని చెప్పాడు.

Acotr brahmaji

ఇదే విషయం బ్రహ్మాజీ భార్య మాట్లాడుతూ కృష్ణవంశీ టీమ్‌ మా పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసింది. నా బ్లౌజ్‌ కూడా రమ్యకృష్ణనే చెన్నై నుంచి కుట్టి తీసుకొచ్చారు. పెళ్లి అయిన తర్వాత ఒక గ్రూప్‌ ఫొటో దిగాం. అంతే.. బ్రహ్మాజీతో సహా అందరూ హడావిడిగా బయలుదేరారు. మోహన్‌బాబుగారి సినిమా షూటింగ్‌ అనంతపురంలో జరుగుతోంది. ఆ సినిమా కారు బయట వేచి చూస్తోంది. దీంతో పెళ్లి షర్టు, ప్యాంట్‌ మార్చుకుని వెళ్లిపోయారు. మూడు రోజుల తర్వాత మళ్లీ వచ్చారు. అని చెప్పి కార్యక్రమంలో నవ్వులు పూయించారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here