టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మరో హీరో, హీరోయిన్ రియల్ లైఫ్‌లో కపుల్స్‌గా మారబోతున్నారు. ఇప్పుడు ఇదే ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో హాట్ టాపిగ్‌గా మారింది. అయితే ఈ ఇద్దరు నటీ,నటుల మధ్య ఏదో సమ్ థింగ్ నడుస్తోందని చాలా రోజులుగా వినిపిస్తోంది. రీసెంట్‌గా హిట్2, మేజర్ సినిమాలతో బాగా పేరు తెచ్చుకున్న నటుడు అడవిశేషు అక్కినేని ఫ్యామిలీ మెంబర్‌గా మారుతున్నారు.

మేటర్ ఏంటంటే.. అడివి శేష్, ఓ అమ్మాయితో కొంత కాలంగా లవ్‌లో ఉన్నారని టాక్. అంతేకాదు ఆమెను పెళ్లి కూడా చేసుకోవాలనీ అనుకుంటున్నారట. అయితే ఆ అమ్మాయి ఎవరోకాదు.. అక్కినేని నాగార్జున మేన కోడలు సుప్రియ అని సమాచారం. సుప్రియ హీరోయిన్‌గా కూడా చేసిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ తొలి సినిమా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోయిన్‌గా పరిచయమైయారు.

సుప్రియ, అడవిశేషు రీసెంట్‌గా వీళ్లద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు ఇప్పటికే విస్తృతంగా వైరల్ అయ్యాయి. తాజాగా ఈ పుకార్లకు కొనసాగింపుగా ..వీరిద్దరి ఎంగేజ్‌మెంట్ కూడా కన్ఫామ్ అయినట్లుగా తెలుస్తోంది. ఇరువర్గాల పెద్దలు వీరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జూన్ 16వ తేదిన సుప్రియ, అడవిశేషు ఉంగరాలు మార్చుకోబోతున్నారట. అయితే ఈ రూమర్స్‌పై గతంలో అడివి శేష్ స్పందించారు. అలాంటిదేమీ లేదని స్పష్టం చేశారు. కానీ మరోసారి ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నారంటూ రూమర్స్ గుప్పుమన్నాయి.. అయితే ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.