Divya Pillai : 75కిలోల వాడిని పడుకోబెట్టుకుని సెక్స్ చేయాలంటే మామూలు విషయం కాదు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

- Advertisement -

Divya Pillai : ‘మంగళవారం’ మూవీ అనగానే ఠక్కున గుర్తుకు వచ్చేది బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్. అయితే, సినిమా చూసినవాళ్లు మాత్రం మరో నటి గురించి కూడా ఆరా తీస్తున్నారు. ‘మంగళవారం’ సినిమాలో చాలా పాత్రలు ఉన్నాయి. ప్రతి పాత్రకు కథలో తగినంత ప్రాధాన్యం ఉంది. అయితే కొన్ని పాత్రలు ప్రేక్షకులను ఎక్కడో ఒక చోట ఆశ్చర్యపోయేలా చేస్తాయి. అలాంటి ఒక పాత్రే జమీందార్ భార్య.. రాజేశ్వరీదేవి. చాలా హుందాతనం నిండిన పాత్ర. చాలా అందంగా, పద్ధతిగా ఉంటుంది ఆమె. ఊళ్లో జనమంతా ఆమెకు చేతులెత్తి మొక్కుతారు. కానీ, క్లైమాక్స్‌లో ఊహించని ట్విస్ట్ ఇస్తుంది. దీంతో ఆడియన్స్ ఆశ్చర్యపోవడమే కాకుండా ఈ పాత్రను కచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు. అందుకనే అసలు ఈ నటి ఎవరా అని చాలా మంది వెతుకుతున్నారు.

తెలుగు కన్నడ, మలయాళ భాషల్లో తెరకెక్కి సూపర్ హిట్‌గా నిలిచింది మంగళవారం సినిమా. అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఈ మూవీలో పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో కనిపించింది. మర్డర్స్ మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కిన మంగళవారం చిత్రం ఏ రేంజ్‌లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. బాక్సాఫీసును ఓ ఊపు ఊపింది. పాయల్ తర్వాత ఇందులో అంతగా హైలెట్ అయిన పాత్ర జమీందార్ భార్య పాత్ర. ఈ పాత్రను దివ్య పిళ్లై అనే మలయాళీ నటి పోషించింది.

- Advertisement -

పనివాడితో అక్రమ సంబంధం పెట్టుకుని, శృంగార సన్నివేశాల్లో రెచ్చిపోయి నటించింది. ఇకపోతే ఈ బ్యూటీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆ చిత్రం గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ‘‘సెట్స్ లో అందరి ముందు సెక్స్ సీన్లలో నటించడం అంత ఈజీ కాదు. 75 కేజీల బరువున్న మనిషి మనపై పడుకున్నప్పుడు ఇబ్బంది పడకుండా రొమాంటిక్ గా ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వాలి. అది చాలా కష్టంగా ఉంటుంది. ఎంత ఇబ్బంది పడిన ఆ ఫీలింగ్స్‌ను ముఖంలో అస్సలు చూపించకూడదు. రొమాంటిక్ సన్నివేశాల్లో నటించే ముందు కో స్టార్స్‌తో కలిసి ముందే చర్చించుకోవాలి’’. అంటూ ఆమె చెప్పుకొచ్చింది. చివర్లో లిప్ లాక్ సన్నివేశాల్లో నటిస్తున్నప్పుడు హే ముద్దు భలే ఉందని ఎంజాయ్ చేయడం లాంటివి ఏం ఉండవంటూ చిరునవ్వుతో వివరించింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here