Vishal : సినిమాల్లో నటించడం అంత సులభం కాదు.. దానికి చాలా లక్ ఉండాలి, టాలెంట్ ఉండాలి, అందం ఉండాలి.. ఇలా చాలా చెప్తుంటారు. కానీ మాటలు రాకపోయినా, వినికిడి లోపం ఉన్నా.. నటి అవ్వొచ్చు అని నిరూపించింది అభినయ. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోయిన్‌గా, సెకండ్ హీరోయిన్‌గా.. ఇలా ఎన్నో పాత్రలు, ఎన్నో సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన అభినయ.

తాజాగా విశాల్‌తో ప్రేమ, పెళ్లి అనే రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చారు. విశాల్‌తో అభినయ దిగిన ఫోటోను చూపించి.. విశాల్‌తో తనకున్న బంధం గురించి చెప్పమన్నారు. ‘‘15 ఏళ్లు అనుకుంటా ఆ టైమ్‌లో మొదటిసారి నేను విశాల్ సినిమా చూశాను. అప్పటినుండి నేను పెద్ద ఫ్యాన్. ఆయనంటే నాకు చాలా ప్రేమ. ఎప్పుడూ కలవాలని అనుకుంటాను కానీ ఆయనను కలవడం చాలా కష్టం.

మార్క్ ఆంటోనీ సినిమాలో ఆయనతో కలిసి పనిచేశాను. అందరు అంటున్నారు ఏంటి అభినయ, విశాల్ పెళ్లి చేసుకుంటున్నారని నేను చాలా సర్‌ప్రైజ్ అయ్యాను. అలాంటిది ఏమీ లేదు. ఆయన చాలా మంచివారు. అందరితో కలిసి ఉండాలని ఎప్పుడూ చెప్తుంటారు’’ అని విశాల్‌తో పెళ్లి అంటూ వస్తున్న రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చింది అభినయ. ‘లాఠీ’ సినిమా ప్రతీ రిలీజ్ సమయంలో యాంకర్ చేసిన వ్యాఖ్యల వల్లే విశాల్, అభినయ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త వైరల్ అయ్యింది తప్పా నిజంగా అలాంటిది ఏమీ లేదన్నారు అభినయ తండ్రి ఆనంద్.