Aishwarya Rai – Abhishek Bachchan : మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు..ప్రపంచం మొత్తాన్ని ఆకట్టుకునే అందం ఆమె సొంతం. అందుకే ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు కొన్ని దశాబ్దాలు అవుతున్నా ఇప్పటికీ ఆమె వన్నెతెరగని అందంతో ఇంకా అంతే జోష్తో దూసుకుపోతోంది. నేటి హీరోయిన్స్ కు కూడా రాని ఆఫర్లు ఆమెకు వస్తున్నాయి. అమితాబ్ బచ్చన్ వారసుడు అభిషేక్ బచ్చన్ ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. కొన్ని రోజుల నుంచి ఈ జంట విడాకులు తీసుకోనుందనే వార్తలు వస్తున్నాయి.
ఈ జంటకు 2011లో పాప కూడా పుట్టింది. ఆమెకు ఆరాధ్య అని పేరు పెట్టారు. బాలీవుడ్ (bollywood) లోనే కాదు టాలీవుడ్ లో కూడా క్యూట్ పెయిర్ గా వర్ణిస్తూ ఉంటారు. అలాంటి ఈ జంట ఇప్పుడు విడిపోతున్నారు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. త్వరలోనే ఈ జంట విడిపోతోంది ఇద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తాయి అంటూ ఇప్పుడు సరికొత్త ప్రచారం వెలుగులోకి వచ్చింది. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్తలు ఇప్పుడు బాలీవుడ్ ను షేక్ చేస్తున్నాయి.
తాజాగా ఈ వార్తలపై అభిషక్ బచ్చన్ స్పందించారు. ఓ అభిమాని ఐశ్వర్య వాళ్ల కూతురు ఆరాధ్యతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేసి ‘మై పిపుల్’ అని రాశాడు. దీనికి జూనియర్ అభిషేక్ స్పందిస్తూ ‘మీ టూ.. నా ప్రపంచం’ అని రిప్లై ఇచ్చాడు. దీంతో ఈ విడాకుల వార్తలు అన్నీ రూమర్స్ అని అర్థమైంది. ఇటీవల నీతా అంబానీ కల్చరల్ సెంటర్ ఓపెనింగ్ ఈవెంట్లో వీరంతా కలిసి సందడి చేశారు.