Aaradhya Bachchan : ప్రపంచ అందగత్తెల జాబితాలో మన దేశానికి చెందిన ఐశ్వర్యా రామ్ ముందుంటారు. వయసు పెరుగుతోన్న తరగని అందంతో మెరిసిపోతుంటారు. ఇప్పటికి కుర్రాళ్లు తమ కలల రాణిగా ఐశ్వర్య రాయ్ తెగ పొగిడేస్తూ ఉంటారు. ప్రపంచ సుందరిగానే కాకుండా సౌత్, నార్త్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా రాజ్యమేలారు ఐశ్వర్య రాయ్. ఈ అమ్మడి అందానికి ఫిదా కానీ యువత లేదంటూ అతిశయోక్తి కాదు. ప్రస్తుతం ఐశ్వర్య సినిమాలకు దూరంగా ఉంటున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్ ని పెళ్లి చేసుకున్న తర్వాత వెండితెరకు కొన్నాళ్ల పాటు దూరం అయ్యారు. అప్పుడప్పుడు పార్టీలు, ఫంక్షన్ లలో కనిపిస్తూ ఫ్యాన్స్ ని కనువిందు చేస్తుంది.
తాజాగా అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కి చివరి రోజు అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ హాజరైంది. ఈ వేడుకకు తన కూతురు ఆరాధ్యతో కలిసి కనిపించింది. ఐష్ కూతుర్ని చూసి అందరూ షాక్ అయ్యారు. అభిషేక్, ఐశ్వర్య గారాల పట్టి ఆరాధ్య బచ్చన్ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు నిత్యం టచ్ లో ఉంటుంది. ఇప్పుడు ఇలా తల్లితో కలిసి కనిపించింది. ఐష్ కు అందంలో పోటీ ఇస్తుంది ఆరాధ్య బచ్చన్. ఆరాధ్య అందం చూసి నెటిజన్లు.. గ్లామర్ లో తల్లిని మించిపోయేలా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
మాయ చేసే కళ్లు, తరగని అందం, బంగారం లాంటి మెరుపుతో ఇప్పటికీ కుర్రకారు మదిని దోచేస్తుంది. తదుపరి ప్రపంచ అందగత్తెల లిస్ట్‌లో ఇప్పుడు ఆరాధ్య పేరు కూడా యాడ్ చేయాలన్నట్లు ఉంది అమ్మడి అందం. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ఫ్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌కు వారు వస్తుంటే అంతా కళ్లప్పగించి చూస్తుండిపోయారు. ప్రస్తుతం వీరి ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా.. వీటిపై నెటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. గ్లామర్‌లో తల్లిని మించిపోయేలా ఉన్నదంటూ పొగిడేస్తున్నారు.