యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన ఆదిపురుష్ చిత్రం, ఇటీవలే గ్రాండ్ గా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిన సంగతి అందరికీ తెలిసిందే. విడుదలకు ముందు కనీవినీ ఎరుగని రేంజ్ అంచనాలు ఏర్పాటు చేసుకున్న ఈ సినిమా, విడుదల తర్వాత మాత్రం మొదటి ఆట నుండే ఆ అంచనాలను అందుకోలేకపోయింది. ఫలితంగా ఓపెనింగ్స్ అయితే కళ్ళు చెదిరే రేంజ్ లోనే వచ్చాయి కానీ, లాంగ్ రన్ లో మాత్రం నాల్గవ రోజు నుండే వసూళ్లు దారుణంగా పడిపోయాయి.
ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అన్నీ ప్రాంతీయ భాషలకు కలిపి 250 కోట్ల రూపాయలకు జరిగింది. తెలుగు మరియు హిందీ భాషల్లో ఓపెనింగ్స్ ద్వారా కాస్త రికవర్ చేసింది కానీ, తమిళం మరియు మలయాళం లో మాత్రం కనీసం కోటి రూపాయిల గ్రాస్ ని కూడా వసూలు చెయ్యలేకపోయింది. కానీ కన్నడ బాషలో డీసెంట్ స్థాయి వసూళ్లు వచ్చాయనే చెప్పాలి.
అయితే బయ్యర్స్ మొత్తం రెండవ వీకెండ్ పై చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా ఫుల్ రన్ లో బ్రేక్ ఈవెన్ అవ్వడం అసాధ్యం. కానీ కనీసం ఈ వీకెండ్ లో ఒక 15 కోట్ల రూపాయిలు రికవర్ అవుతుంది అనుకున్నారు. కానీ కనీసం నాలుగు కోట్ల రూపాయిలు కూడా రెండవ వీకెండ్ లో రాలేదు. ఇక హిందీ లో చివరి ప్రయత్నం గా ఈ చిత్రాన్ని 3D గ్లాస్సెస్ తో కలిపి 112 రూపాయలకే టికెట్స్ విక్రయించబోతున్నామని మేకర్స్ నిన్ననే ఒక అధికారిక ప్రకటన చేసారు.
ఇదేమన్నా హిందీ వెర్షన్ వసూళ్లకు కాస్త ఉపయోగపడుతుందేమో చూడాలి. గతం లో కూడా ఇలాగే బ్రహ్మాస్త్ర విషయం లో చేసారు. అది గ్రాండ్ సక్సెస్ అయ్యింది, ‘ఆదిపురుష్’ విషయం లో కూడా అలాగే జరుగుతుందో లేదో చూడాలి. ఇక పోతే ఆదిపురుష్ చిత్రానికి 10 రోజులకు కలిపి 390 కోట్ల రూపాయిల గ్రాస్ మరియుఈ 182 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినట్టు చెప్తున్నారు మేకర్స్.