ఆస్కార్‌లో కొత్త రూల్‌.. ఈ అర్హత లేకుంటే నో ఎంట్రీ?

- Advertisement -

ఆస్కార్‌ సభ్యత్వ నమోదు ప్రతేడాది జరుగుతుంది. ఆస్కార్‌ అవార్డు గెలుచుకోవాలంటే ఈ సభ్యుల ఓటింగ్ కీలకంగా మారుతుంది. ఈ క్రమంలోనే 96వ ఆస్కార్‌ అవార్డుల ప్రదానం మార్చి 14న జరుగింది. కాగా ‘క్లాస్‌ ఆఫ్‌ 2023’లో భాగంగా 398 మంది కొత్త సభ్యులకు ఆస్కార్‌ సభ్యత్వ ఆహ్వానాన్ని పంపినట్లు ఆస్కార్‌ కమిటీ సీఈవో బిల్‌ క్రామెర్, అధ్యక్షుడు జానెట్‌ యాంగ్‌ ఇటీవల వెల్లడించారు. ఈ జాబితాలో మన దేశం నుంచి సుమారు 15మంది ఉన్నారు. వారికి ఆస్కార్ సభ్యత్వ ఆహ్వానం అందినట్లు సమాచారం. కాగా తెలుగు చిత్రపరిశ్రమ నుంచి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా టీమ్‌లోని ఆరుగురు, తమిళం నుంచి దిగ్గజ దర్శకుడు మణిరత్నం, బాలీవుడ్‌నుంచి ప్రముఖ దర్శక-నిర్మాత కరణ్‌ జోహార్‌ ఉన్నారు.

ఆస్కార్‌
ఆస్కార్‌

వృత్తిపరమైన అర్హతలు, ప్రపంచవ్యాప్త గుర్తింపు వంటి అంశాల ఆధారంగా ఈ జాబితాను తయారు చేసింది అకాడమీ. ఈ 398 మందిలో దాదాపు 51 దేశాలకు చెందినవారు ఉన్నారు. వీరిలో 40 శాతం మంది మహిళలు, 52 శాతం మంది యూఎస్‌కు చెందనివారు ఉన్నట్లు ఆస్కార్‌ కమిటీ ప్రతినిధులు ప్రకటించారు. ఈ కొత్త సభ్యులతో కలిసి ఆస్కార్‌ మెంబర్‌షిప్‌ కలిగి ఉన్నవారి సంఖ్య 10,817కు చేరినట్లు హాలీవుడ్‌ వెల్లడించింది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లోని ‘నాటు నాటు’ పాటకుగాను ‘బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌’ విభాగంలో ఆస్కార్‌ అవార్డు అందుకున్న సంగీత దర్శకుడు కీరవాణి, గీత రచయిత చంద్రబోస్‌లకు అకాడమీ ఆహ్వానాలు అందాయి. అదే విధంగా ఈ చిత్రం గ్లోబల్ హీరోలు ఎన్టీఆర్, రామ్‌చరణ్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌ సాబు సిరిల్, సినిమాటోగ్రాఫర్‌ సెంథిల్‌ కుమార్‌లు కూడా ఆస్కార్‌ అకాడమీ సభ్యులు కానున్నారు.

ఇది ఇలా ఉంటే ఏదైనా సినిమాను ఆస్కార్ ఎంట్రీ కి పంపించాలంటే అమెరికాలోని ఆరు ప్రధాన నగరాలైన న్యూయార్క్, లాస్‌ ఏంజెల్స్, చికాగో, మియామి, అట్లాంటా, శాన్‌ ఫ్రాన్సిస్‌కోలలో కనీసం వారం పాటు ప్రదర్శితం కావాలి. ఈ ఏడు రోజుల్లో ఒక షో అయినా ప్రైమ్‌ టైమ్‌లో ప్రదర్శితం అయ్యి ఉండాలట. బెస్ట్‌ పిక్చర్, ఫారిన్‌ బెస్ట్‌ ఫిల్మ్‌ విభాగాల విషయంలో మరో కొత్త రూల్ తీసుకొచ్చారట. ఇక నుంచి ఏ సినిమాని అయినా ఆస్కార్ కు పంపాలంటే కనీసం పాతికకి పైగా మూవీ మార్కెట్స్‌ ఉన్నచోట రెండు వారాలకు పైగా ఆ సినిమాని ప్రదర్శించాలి. ఈ రూల్ 97వ ఆస్కార్‌ అవార్డ్స్‌ ప్రదానోత్సవం నుంచి ఈ రూల్స్ అమలులోకి రానున్నాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

   
vps230225.betterwebtechnologies.com telugucinematoday.com