ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో వరుస మరణాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.. ఇప్పుడు మరో కమెడియన్ మృతి చెందారు.. తమిళ్ డైరెక్టర్.. కమెడియన్ మనోబాల కన్నుమాశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో భాదపడుతున్న ఆయన… కాసేపటి క్రితం తుదిశ్వాస విడిచినట్లుగా సమాచారం.. ఆయన మరణం సినీ పరిశ్రమతో పాటు అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది.ఇండస్ట్రీలో కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. జనవరిలో యాంజియో చికిత్స చేయించుకున్నారు. అప్పటి నుంచి పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బుధవారం మరణించారు.

గతకొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మనోబాల, ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. జనవరిలో యాంజియో చికిత్స తీసుకున్న మనోబాల, అప్పటి నుండి అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. కాగా, ఆయన తాజాగా మృతిచెందినట్లుగా కుటుంబ సభ్యులు వెల్లడించారు. తమిళ దర్శకుడు భారతీరాజా వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించిన మనోబాల, ఆ తరువాత దర్శకుడిగా మారి అనేక సినిమాలు చేశారు. అటుపై నటుడిగా, తనదైన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.. ఎన్నో సినిమాలకు అవార్డులను కూడా అందుకున్నారు..
నిర్మాతగా కూడా మనోబాల పలు సినిమాలను తీసి ప్రేక్షకులను అలరించారు. సూర్య నటించిన ‘గజిని’ సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు ఈ వర్సటైల్ యాక్టర్. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ మూవీలో జడ్జి పాత్రలో మనోబాల నటించారు. మనోబాల మృతి సినీ పరిశ్రమకు తీరని లోటు అని పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. మనోబాలకు భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు.. ఆయన అంత్యక్రియలు నేడు జరగనున్నాయని సమాచారం… ఆ కార్యక్రమానికి తమిళ సినీ రాజకీయ అభిమానులు భారీ ఎత్తున హాజరుకానున్నారని సమాచారం..