Star Actress : అవి చూపించమన్న అభిమాని.. సిగ్గు లేకుండా ఫోటో తీసి షేర్ చేసిన స్టార్ హీరోయిన్

- Advertisement -

Star Actress : టాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక అరుళ్‌ మోహన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. గ్యాంగ్ లీడర్, శ్రీకారం లాంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ముద్దుగుమ్మ. శివ కార్తికేయన్ డాన్ సినిమాతో తమిళ్ తో పాటు తెలుగులోను మంచి క్రేజ్ తెచ్చుకుంది. తన అందం, నటనతో ఎంతోమంది అభిమానులను ఆకట్టుకుంది ఈ చిన్నది. ప్రస్తుతం తెలుగులో వరుస ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతుంది. ఈ క్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ, నేచురల్ స్టార్ నాని సరిపోదా శనివారం సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉంది. సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉంటూ ఫ్యాన్స్ కు గ్లామర్‌ ట్రీట్ ఇస్తుంది.

ఎప్పటికప్పుడు అభిమానులతో ముచ్చటించి వారిని ఖుషి చేస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా మరో సారి అభిమానులతో ముచ్చటించింది. ఇందులో భాగంగా ఓ అభిమాని కోరిన వింత కోరికను తీర్చి నెటింట్లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఇంతకీ ఆ అభిమాని ఏం అడిగాడు.. ఏం చేసింది అని చూస్తున్నారా. నిన్న ఆదివారం కావడంతో ఇన్ స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో ముచ్చటించింది ప్రియాంకా ఆరుళ్‌ మోహన్. ఇందులో భాగంగా అభిమానులకు ఆమె అంటే ఎంత ఇష్టమో వివరించారు. మీ ట్రెడిషనల్ లుక్కు కి మేమంతా ఫిదా అవుతున్నాం అంటూ కామెంట్స్ చేశారు. దీనిపై ప్రియాంక రియాక్ట్ అవుతూ ప్రేమగా థ్యాంక్స్ అంటూ వివరించింది. ఇందులో భాగంగా ఓ నెటిజన్ అడిగిన వింత కోరిక ను ప్రియాంక తీర్చింది.

మీ చేతి వేళ్లను చూడాలని ఉంది. ఒకసారి వాటిని పోస్ట్ చేయండి ప్లీజ్ అంటూ నెటిజ‌న్ కామెంట్ ద్వారా కోరాడు. దీనిపై ప్రియాంక వెంటనే స్పందించింది. అతని కోరిక తీరుస్తూ.. తన చేతి వేళ్లను పిక్ తీసి షేర్ చేసింది. అమె చేతి వేళ్లకు ఉన్న గోళ్లు ఎంతో అందంగా కనిపిస్తున్నాయి. దీంతో ఈ ఫోటో ప్రస్తుతం నెటింట‌ తెగ ట్రెండ్‌ అవుతుంది. వాడు ఏ ఉద్దేశంతో అడిగాడో అంటూ కొంతమంది ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here