Anchor Anasuya : తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇప్పటికే ఆరుసీజనలను పూర్తి చేసుకుంది. ఇప్పుడు సీజన్ 7 ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ సమాచారం అందుతుంది.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే నాగార్జున తప్పుకోవడంతో కొత్త హోస్ట్ ఎంపిక జరిగినట్లుగా తెలుస్తోంది.. ఈ షోకు ఈ సారి ఫెమస్ పర్సన్స్ ను తీసుకోవాలని యాజమాన్యం భావిస్తుంది.. అయితే యాంకర్ అనసూయను ఇందుకోసం సంప్రదించరట.. అయితే ఆమె భారీగా డిమాండ్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి..

ఇకపోతే ఆమె బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లేందుకు ఓకే చెప్పినట్లుగా సమాచారం అందుతుంది. బిగ్బాస్ కార్యక్రమానికి హాజరైనందుకు అనసూయ ఓకే చెప్పింది. కానీ రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం తగ్గేది లేదు అన్నట్లుగా డిమాండ్ చేస్తుందట. స్టార్ మా వారి నుండి అందుతున్న సమాచారం ప్రకారం వారానికి రూ.
7.50 నుండి 8.50 లక్షల రూపాయలను ఆమె డిమాండ్ చేస్తుందట. అనసూయకు ఉన్న క్రేజీ నేపథ్యంలో ఫైనల్ వరకు ఉండే అవకాశం ఉంది. అంటే అప్పటి వరకు అనసూయ కి కోటికి పైగా రెమ్యూనరేషన్ రూపంలోనే దక్కుతుంది. ఒక వేళ విజేతగా నిలిస్తే అప్పుడు కచ్చితంగా మరో రూ. 50 లక్షలు అందుతుంది.. మొత్తానికి అను పెద్ద మొత్తంకే ప్లాన్ వేసింది..

ఏకంగా కోటిన్నర రూపాయలు ఆమెకు రెమ్యూనరేషన్ గా దక్కే అవకాశాలు ఉంటాయి. నిజంగానే అనసూయ బిగ్ బాస్ కి వెళ్తుందా అనే విషయంపై క్లారిటీ లేదు. కానీ ఆమె వెళ్తే మాత్రం ప్రేక్షకులు ఆమె కోసం అయినా చాలా మంది చూసే అవకాశం ఉంది. అందుకే బిగ్ బాస్ వారు ఆమె ను ఎంపిక చేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
కాస్త ఎక్కువ రెమ్యూనరేషన్ అయినా పర్వాలేదని ఆమెని తీసుకొస్తే బాగుండు అని బిగ్ బాస్ టీమ్ కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.. సినిమాలు, యాంకరింగ్, సోషల్ మీడియాలో అనసూయకు మంచి క్రేజ్ ఉండటంతో దాన్ని క్యాష్ చేసుకొనే ఆలోచనలో ఉన్నారు.. మరి అనసూయ ఎంట్రీ ఇస్తుందో లేదో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చెయ్యాల్సిందే..