హీరోయిన్ Keerthy Suresh గురించి అందరికి తెలుసు.. ప్రస్తుతం వరుస ఆఫర్లను అందుకుంటూ దూసుకెళ్తున్నారు. అందం, అభినయంతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. ఫిట్ సెన్ కోసం కఠినమైన యోగాసనాలు వేస్తూ ఆకట్టుకుంటున్నారు.. ఎప్పుడూ సోషల్ మీడియా యాక్టివ్ గా ఉంటూ యూత్ కు పిచ్చిక్కేంచేలా లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది.. తాజాగా పచ్చని చెట్ల మధ్య యోగా చేస్తున్న ఫోటోలను షేర్ చేసింది.. అవి కాస్త నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.. లైకులు, షేర్ లతో రచ్చ చేస్తున్నాయి..
కీర్తి సురేష్ కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టిన చిత్రం ‘మహానటి’. అలనాటి నటి సావిత్రి జీవితం ఆధారంగా టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించారు. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ అద్భుతమైన పెర్ఫామెన్స్ కనబర్చిన విషయం తెలిసిందే.. ఈ సినిమాతో బాగా ఫెమస్ అవ్వడంతో పాటు.. జాతీయ స్థాయి అవార్డును కూడా సొంతం చేసుకున్నారు కీర్తి సురేష్. అప్పటి నుంచి స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ కూడా వచ్చింది. రామ్ పోతినేని, నాని, తమిళ స్టార్ సూర్య, శివ కార్తికేయతో నటించి మెప్పించారు.. అన్ని ఇండస్ట్రీలలో నటిగా గుర్తింపును తెచ్చుకున్నారు..
ఇటీవల వెండితెరపై అందాలను ఒళకబోస్తున్నారు. చివరిగా తెలుగులో సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన ‘సర్కారు వారి పాట’లో నటించి బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నారు. చిత్రంలో నటనతో పాటు.. డాన్స్, గ్లామర్ షోతో కూడా చేసి కుర్రకారుకు నిద్రలేకుండా చేసింది.. ఫిట్ గా, గ్లామర్ గా కనిపించేందుకు కీర్తి సురేష్ పలు ఎక్సర్ సైజ్ లు, ఫిట్ నెస్ సంబంధింత వర్కౌట్స్ చేస్తుంటారు.
తాజాగా కఠినమైన యోగాసనాలు వేస్తూ దర్శనమిచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కీర్తి సురేష్..గార్డెన్ లో పొట్టి డ్రెస్ లో కఠినమైన యోగాసానాలు వేశారు. ఒకవైపు గ్లామర్ విందు చేస్తూనే.. మరోవైపు ఒంట్లోని ఫ్యాట్ ను కరిగించేస్తున్నారు. మరింత స్టిమ్ గా, ఫిట్ తయారయ్యేందుకు ఇలా శ్రమిస్తున్నారు.
ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.. వామ్మో.. కీర్తి సురేష్ ఇలా రెచ్చిపోతుందేంటి.. అంటూ జనాలు కామెంట్లు చేస్తున్నారు..తెలుగులో నాని ‘దసరా’లో నటించగా.. విడుదలకు సిద్ధమవుతోందీ చిత్రం. ఇక చిరుకు చెల్లెలిగా ‘భోళా శంకర్’లోనూ నటిస్తున్నారు. ఇదిలా ఉండేగా రీసెంట్ గా ‘రివాల్వర్ రీటా’ సినిమాను ప్రకటించారు. ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటోంది. ఇక తమిళంలో ‘సైరెన్, మామన్నన్, రఘు తాత’ వంటి సినిమాలు చేస్తున్నారు..