Jr NTR : తారక్ చెప్పాడని ప్రభాస్ నో చెప్పాడట.!? ఇప్పటికీ శాపనార్ధాలు పెడుతున్న ప్రొడ్యూసర్.!

- Advertisement -

Prabhas – Jr NTR : ప్రభాస్ జూనియర్ ఎన్టీఆర్ ఎంత సన్నిహితంగా ఉంటారు మనందరికీ తెలుసు.. వీళ్ళిద్దరూ కలిసి వెళ్లిన పలు సినీ ఈవెంట్స్ లో కూడా పక్కపక్కనే కూర్చుంటారు.. ప్రభాస్ తారక్ ఇద్దరు తరచూ ఫోన్ లో వారి సినిమాల గురించి చర్చించుకుంటూ ఉంటారు.. ఈ డైరెక్టర్ నాకు సినిమా కథ చెప్పారని.. ఈ ప్రొడ్యూసర్ నాకు స్టోరీ లైన్ చెప్పారని.. ఎవరితో సినిమా చేస్తే బాగుంటుందని వీళ్ళిద్దరూ తరచూ చర్చించుకుంటూనే ఉంటారు..

Cinema Gossips
Prabhas – Jr NTR

అయితే ప్రభాస్ కి ఓ సినిమా విషయంలో తారక్ ఓ సలహా ఇచ్చారట.. వెంటనే తారక్ మాట విని ప్రభాస్ ఆ ప్రొడ్యూసర్ కి నో చెప్పారట. టాలీవుడ్ ఇండస్ట్రీలో వేగంగా సినిమాలలో నటించే హీరోలలో ఒకరిగా జూనియర్ ఎన్టీఆర్ కు పేరు ఉంది.. ఒకే ఏడాది తారక్ నటించిన రెండు సినిమాలు విడుదలైన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి తారక్ చెప్పిన తరువాత ప్రభాస్ ఆ ప్రొడ్యూసర్ ను సున్నితంగా తిరస్కరించాడట.. అయితే ఈ విషయాలను ఆ ప్రొడ్యూసరే స్వయంగా చెప్పడంతో సోషల్ మీడియాలో ఆ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Avula Giri

నైజాంలో టాప్ డిస్ట్రిబ్యూటర్ గా ఉన్న ఆవుల గిరి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రభాస్ కి వర్షం సినిమాతో మంచి హిట్ పడిన తర్వాత.. ప్రభాస్ తో సినిమా చేయాలని ఆవుల గిరి అనుకున్నారట. తన తండ్రి సూర్యనారాయణ రావు సమక్షంలో సినిమా చేసేందుకు మాట కూడా తీసుకున్నారట.

- Advertisement -

కాకపోతే ఆయన వెళ్ళిన రోజు మంచి రోజు కాదని.. అడ్వాన్స్ తర్వాత తీసుకుంటానని ప్రభాస్ చెప్పారట. సరే అని ఇంటికి వెళ్లారట ఆవుల గిరి. అయితే ఆయనంటే గిట్టని కొందరు డిస్ట్రిబ్యూటర్లు జూనియర్ ఎన్టీఆర్ తో ప్రభాస్ కి ఫోన్ చేయించారు.. ఆవుల గిరి తో సినిమా చేయొద్దు అంటూ జూనియర్ ఎన్టీఆర్ ప్రభాస్ కి చెప్పారు..

దాంతో ప్రభాస్ నాతో సినిమా చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించలేదు. తారక్ ప్రభాస్ కి ఫోన్ చేసి ఆ విషయం చెప్పారని నాకు ఆ తర్వాత తెలిసింది. అలా నా బ్యానర్లో ప్రభాస్ సినిమా చేసే అవకాశాన్ని కోల్పోయాను. ఒకవేళ నేను కనుక ప్రభాస్ తో సినిమా చేసి ఉండుంటే ఇప్పుడు మంచి ప్రొడ్యూసర్ గా ఉండే వాడినని ఆవుల గిరి చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here