మృణాల్ ఠాకూర్ ఎవరో తెలుసా అంటే కాసేపు ఆలోచిస్తారు.. అదే సీత తెలుసా వెంటనే సీతారామం సినిమా గుర్తొస్తుంది. అంతలా ఆకట్టుకుంది ఈ భామ అభినయం. అందం, అభినయం రెండూ కలిసి ఉండటం చాలా అరుదు. కాని మృణాల్మాత్రం బాపు బొమ్మని గుర్తు తెచ్చింది అందరికి. అందుకే టాలీవుడ్‌తో పాటు తమిళ, మళయాళ, కన్నడ చిత్ర పరిశ్రమల నుంచి హీరోయిన్ ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి Mrunal Thakur కి. అసలు కురుక్షేత్రంలో రావణ సంహారం.. యుద్ధపు వెలుగుల్లో సీతా స్వయంవరం అంటూ లెఫ్టినెంట్ రామ్‌కు లేఖ రాసి రాముడి హృదయాన్నే కాదు యావత్ భారత సినీ ప్రేక్షకులన హృదయాలను దోచుకుంది సీత.
అదేనండి సీతారామం సినిమాలో సీత పాత్రలో నటించిన మృణాల్ ఠాకూర్. ఈ అమ్మడు స్వతహాగా ఉత్తర భారతీయురాలైనా.. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను తన ప్రేమలో పడేసింది. మృణాళ్ అని అంటే కాసేపు ఆలోచిస్తారేమో.. అదే సీత అంటే ఠక్కున ఓ మా సీతారామం సీతనా అని గుర్తొచ్చేస్తుంది. అంతలా మృణాల్ పాత్ర ప్రేక్షకుల మనసుల్లో ఎన్నటికీ చెరిగిపోని ముద్ర వేసింది.
అందం, అభినయం, అణుకువ ఇలా అమ్మాయిలకు అసలైన ఆభరణాలు కలిగి ఉన్న అరుదైన ముత్యం మన సీత. ఒక్కసారిగా మనకు బాపూ బొమ్మను గుర్తు చేసింది ఈ భామ. సీత పాత్రలో తనను చూసి ఫిదా కానీ వారుండరు ఎవరూ. అందుకే ఈ సీతమ్మకు టాలీవుడ్లోనే కాదు తమిళ, మలయాళ, కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఆఫర్లు క్యూ కడుతున్నాయి.
ఈ ముద్దుగుమ్మ ప్రభాస్ ప్రాజెక్ట్ కే లోనే చేయాల్సింది. కానీ రెండు సినిమా షెడ్యూల్లు క్లాష్ అవ్వడం సీతారామంలోని పాత్రకు కరెక్టుగా సూటవుతుందని ప్రాజెక్ట్‌కే లో వేరేవారికి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు సీతారామం సౌత్‌తో పాటు హిందీలోనూ సూపర్ హిట్ అవ్వడంతో మృణాల్ ఎవరు? బయోగ్రఫీ ఏంటీ? అని నెట్లో విపరీతంగా సెర్చ్ చేస్తున్నారట.
మృణాల్ సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ప్రతిరోజూ తనకు సంబంధించిన విషయాలు పోస్టు చేస్తుంది. ప్రస్తుతం తన కొత్త సినిమాలేం విడుదల కావడం లేదు. అయినా తన ఫ్యాన్స్ నిరాశపడకుండా రోజూ ఫొటోషూట్ చేస్తూ ఫొటోలు అప్డేట్ చేస్తోంది. మరోవైపు ఈ భామ రాముడు అదేనండి దుల్కర్ సల్మాన్‌తో కలిసి విదేశాల్లో సీతారామం సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది.
ఈ బాలీవుడ్ భామ సినిమాల్లోకి రాకముందు మోడలింగ్ చేసింది. ఆ తర్వాత హిందీ సీరియల్లు, పలు రియాల్టీ షోలలో పాల్గొంది. పలు వాణిజ్య ప్రకటనల్లోనూ మెరిసింది. అలా కాస్త గుర్తింపు పొందిన తర్వాత లవ్ సోనియా అనే సినిమాతో బాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది.
కానీ ఆ సినిమా ఆశినంతంగా ఆడలేదు. ఆ తర్వాత అడపాదడపా అవకాశాలు వచ్చిన హిందీ ఇండస్ట్రీలో సరైన హిట్ ఒక్కటీ పడలేదు మృణాల్‌కి. సూపర్ 30, జెర్సీ, ధమాకా, బాట్లా హౌజ్ వంటి పలు చిత్రాలు చేసినా అన్నీ బాక్సాఫీస్ వద్ద బోర్లాపడ్డాయి. తెలుగులో చేసిన సీతారామంతో ఒక్కసారిగా మృణాల్ డిమాండ్ పెరిగిపోయింది. తెలుగులోనే కాకుండా సౌత్ సినీ ఇండస్ట్రీలో సీత పేరు మార్మోగింది. సీతారామం ఇచ్చిన హిట్‌తో బాలీవుడ్‌లోనూ మృణాల్ క్రేజ్ పెరిగింది. ఇప్పుడు అక్కడ కూడా వరుస ఆఫర్లు వస్తున్నాయి.