Waltair Veerayya : ప్రతీ సంక్రాంతికి లాగానే ఈ సంక్రాంతికి కూడా రెండు మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘ Waltair Veerayya ‘ మరియు నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘వీర సింహా రెడ్డి’ చిత్రాలు విడుదలై సూపర్ హిట్ అయ్యాయి.. ఈ రెండు సినిమాలు కూడా మైత్రి మూవీ మేకర్స్ నుండే వచ్చాయి.. జనవరి 11 వ తారీఖున విడుదలైన ‘వీర సింహా రెడ్డి’ చిత్రానికి బంపర్ ఓపెనింగ్స్ వచ్చాయి కానీ లాంగ్ రన్ పర్వాలేదు అనే రేంజ్ తో సరిపెట్టుకుంది.. కానీ బాలయ్య కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రం గా నిలిచింది.
ఇక మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా మాత్రం టాలీవుడ్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 6 చిత్రాలలో ఒకటిగా నిలిచింది.ఈ రెండు చిత్రాలు విడుదలై 25 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతాల వారీగా ఎంత వసూళ్లను రాబట్టిందో ఇప్పుడు ఒకసారి పోల్చి చూద్దాము.
ప్రాంతం : వాల్తేరు వీరయ్య : వీర సింహా రెడ్డి:
నైజాం 35.82 కోట్లు 17.31 కోట్లు
సీడెడ్ 18.09 కోట్లు 16.50 కోట్లు
ఉత్తరాంధ్ర 19.06 కోట్లు 08.55 కోట్లు
తూర్పు 12.90 కోట్లు 06.66 కోట్లు
పశ్చిమ 07.08 కోట్లు 04.90 కోట్లు
గుంటూరు 09.11 కోట్లు 07.42 కోట్లు
కృష్ణ 07.66 కోట్లు 04.73 కోట్లు
నెల్లూరు 04.60 కోట్లు 03.00 కోట్లు
మొత్తం 114.32 కోట్లు 69.07 కోట్లు
పైన చూపించిన కలెక్షన్స్ మొత్తం కేవలం రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినవే.. వాల్తేరు వీరయ్య చిత్రం కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా ప్రాంతాలకు కలిపి 8 కోట్ల 14 లక్షల రూపాయిలను వసూలు చేసింది, అలాగే ఓవర్సీస్ లో ఈ సినిమా 13 కోట్ల 25 లక్షల రూపాయిల షేర్ ని రాబట్టింది.. ఈ రెండు కలిపితే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి ఇప్పటి వరకు 135.71 కోట్ల రూపాయిలను రాబట్టింది.
ఇక వీర సింహ రెడ్డి విషయానికి వస్తే కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా ప్రాంతాలకు కలిపి 4 కోట్ల 85 లక్షల రూపాయిల షేర్ ని వసూలు చెయ్యగా, ఓవర్సీస్ లో 5 కోట్ల 77 లక్షల రూపాయిల షేర్ ని రాబట్టింది.ఈ రెండు కలిపితే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి 79.69 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి..ఇది బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా చెప్పుకోవచ్చు.. కానీ మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా ‘వీర సింహా రెడ్డి‘ చిత్రం కంటే 55 కోట్ల రూపాయిలు అదనంగా వసూలు చెయ్యడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన అంశం.