Bandla Ganesh : సినిమాలు ఎక్కువ చేయకున్న నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌ను అమితంగా ఆరాధించే బండ్లన్న నిత్యం ఏదో ఒక విషయంపై ట్వీట్లు చేస్తూ నెటిజన్లను పాలకరిస్తూ ఉంటాడు.అయితే కొన్నిసార్లు ఆయన చేసే వ్యాఖ్యలు దుమారం రేపుతాయి.
తాజాగా మరోసారి పవన్ పై వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచాడు.. బండ్ల..పవర్‌స్టార్‌తో తీన్‌మార్, గబ్బర్ సింగ్ లను నిర్మించాడు గణేశ్. ఇందులో తీన్‌మార్ నిరాశపరచగా, గబ్బర్ సింగ్ మాత్రం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత ఎన్టీఆర్, రామ్‌చరణ్, బన్నీలతో లు చేసి స్టార్ ప్రొడ్యూసర్‌గా ఎదిగిపోయాడు.
అయితే గత కొన్నేళ్లుగా నిర్మాణాలకు దూరంగా ఉన్నాడాయన. 2015లో ఎన్టీఆర్‌తో టెంపర్ తర్వాత మరే ను ప్రొడ్యూస్ చేయలేదు. అయితే ఈ మధ్యన డేగల బాబ్జీ అంటూ హీరోగా అదృష్టం పరీక్షించుకున్నాడు. అలాగే మోహన్‌బాబు సన్ ఆఫ్ ఇండియాలోనూ ఓ కీలక పాత్ర పోషించాడు.
ఈ నేపథ్యంలో బండ్ల గణేశ్ పవర్‌స్టార్‌తో మళ్లీ తీయనున్నట్లు పుకార్లు షికార్లు చేశాయి. దీనికి తగ్గట్లే అప్పుడప్పుడు తన ట్వీట్ల ద్వారా హింట్లు ఇస్తూ వచ్చాడు గణేశ్. అయితే ఇవేవీ కార్యరూపం దాల్చలేదు. మరోవైపు పవన్ కల్యాణ్ మాత్రం అటు రాజకీయాలతో బిజీగా ఉండగానే వరుసగా కొత్త ప్రాజెక్టులు అనౌన్స్ చేస్తున్నాడు.
ఈక్రమంలో పవన్‌తో పై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు బండ్లన్న.. తాజాగా ట్విట్టర్ ద్వారా నెటిజన్లతో ముచ్చటించిన ఆయనను ఒక అభిమాని ‘గణేశ్ అన్నా.. పవన్ కల్యాణ్ గారితో ఒక మూవీ చేయాలి. మీరెప్పుడు చేస్తారు. పీఎస్‌పీకే ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ’ అని ప్రశ్నించాడు. దీనికి బాస్ కాబోయే సీఎం.. ఇక సినిమాలు లేవు’ అని రిప్లై ఇచ్చాడు బండ్ల.. పవన్ కళ్యాణ్ తో సినిమాలు చెయ్యనని బండ్ల గణేశ్ క్లారిటీ ఇచ్చాడు. పవన్ రాజకీయాల్లో బిజీగా ఉన్నారని ఏపీకి కాబోయే కల్యాణేనంటూ మరోసారి పవర్‌స్టార్‌పై తన అభిమానాన్ని చాటుకున్నాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..