Sai Pallavi : కమర్షియల్ డైరెక్టర్స్ డిమాండ్స్ ని పక్కన పెట్టి మా మనసుకి నచ్చితేనే ఒక సినిమా చెయ్యడానికి ఒప్పుకుంటాము అని తమ చుట్టూ ఒక గీతని గీసుకున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు, వారిలో సాయి పల్లవి ఒకరు. ఈమెని అందరూ ముద్దుగా లేడీ పవర్ స్టార్ అని పిలుస్తారు,అంతతి క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ఆమె సొంతం. అందం ఉన్నప్పటికీ కూడా తన తోటి హీరోయిన్స్ లాగ గ్లామర్ షోస్ చెయ్యడానికి ఈమె పూర్తిగా వ్యతిరేకం.
కథలో మరియు తన పాత్రలో దమ్ము ఉంటేనే ఈమె ఒక సినిమా చెయ్యడానికి ఒప్పుకుంటుంది. అలాంటి గీత గీసుకున్నప్పటికీ కూడా ఈమె టాలెంట్ కి టాలీవుడ్ లో అవకాశాలు వెల్లువలాగా వస్తూనే ఉన్నాయి. ఈమె లాగ డ్యాన్స్ డ్యాన్స్ మరియు యాక్టింగ్ చేసే హీరోయిన్ రీసెంట్ గా వచ్చిన వారిలో శ్రీ లీల కి మినహా ఎవరు లేరు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.
అయితే సాయి పల్లవి ఒక డాక్టర్ అని అందరికీ తెలిసిన విషయమే,అయితే ఎవరికీ తెలియని విషయం ఏమిటంటే ఈమె బాలనటిగా పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించిందనే. కోలీవుడ్ క్రేజీ హీరో జయం రవి – కంగనా రనౌత్ కాంబినేషన్ లో తెరకెక్కిన తమిళ చిత్రం ‘ధూమ్ ధామ్’ లో సాయి పల్లవి హీరోయిన్ కంగనా రనౌత్ తో ఉండే చైల్డ్ ఆర్టిస్ట్స్ లో ఒకరిగా నటించింది, ఆ తర్వాత ప్రసన్న – మీరా జాస్మిన్ హీరో హీరోయిన్లు గా నటించిన మరో తమిళ సినిమాలో కూడా సాయి పల్లవి బాలనటిగా నటించింది.
ఇలా చిన్నతనం నుండే సినీ రంగం లోకి రావాలనే ఆసక్తి ఉన్న సాయి పల్లవి కి డ్యాన్స్ అంటే మహా ఇష్టం, ఈటీవీ లో ప్రసారమయ్యే ‘ఢీ’ షో లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొని టాప్ 3 లో ఒకరిగా నిలిచింది. ఆ తర్వాత మలయాళం ‘ప్రేమమ్’ సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవి నటించే ఛాన్స్ దక్కింది.. ఆ సినిమా పెద్ద హిట్ అయిన తర్వాత ఇక సాయి పల్లవి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.