Agent Movie : అక్కినేని కుటుంబం నుండి భారీ అంచనాల నడుమ ఇండస్ట్రీ కి గ్రాండ్ గా లాంచ్ అయిన హీరో అక్కినేని అఖిల్..ఇతనికి మొదటి సినిమా నుండే ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది..అక్కినేని ఫ్యామిలీ వైభోగం ని పాన్ ఇండియా లెవెల్ కి తీసుకెళ్తాడు అని అందరూ అభిమానుల గట్టి నమ్మకం..కానీ ఇతగాడికి ఇండస్ట్రీ లో అడుగుపెట్టినప్పటి నుండి ఇప్పటికి సరైన కంటెంట్ తో ఒక్క సినిమా కూడా పడలేదు.
ఇండస్ట్రీ ని షేక్ చేస్తాడు అనుకుంటే రీ రీ లాంచులకే అతని ప్రైమ్ టైం మొత్తం వేస్ట్ అవుతుంది కానీ, సరైన బ్రేక్ ఇప్పటికి తగలలేదు..’మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ అనే సినిమా ఒక్కటి మాత్రమే బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ సాధించింది.. ఆ చిత్రానికి వచ్చిన రెవిన్యూ కూడా గొప్పదేమీ కాదు.. పట్టుమని పాతిక కోట్ల రూపాయిల షేర్ కూడా ఆ సినిమాకి రాలేదు.
అలాంటి అక్కినేని అఖిల్ ని పెట్టి 80 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో ‘ఏజెంట్’ సినిమా తీసాడు డైరెక్టర్ సురేందర్ రెడ్డి.. ఈ సినిమా పాన్ ఇండియా స్కేల్ లో తెరకెక్కింది.. అక్కినేని ఫ్యాన్స్ ఆశలన్నీ ఈ సినిమా మీదనే ఉన్నాయి.. మార్కెట్ లో కూడా ఈ చిత్రం పై అంచనాలు బాగానే ఉన్నాయి.. థియేట్రికల్ బిజినెస్ కూడా 80 నుండి 90 కోట్ల రూపాయిల మధ్యలో ఉంటుంది.. కానీ అఖిల్ సినిమా అంత వసూళ్లను రాబడుతుందా లేదా అనేదే చర్చ.
కానీ బాలయ్య బాబు కి కూడా అఖండ చిత్రానికి ముందు 30 కోట్ల రూపాయిల మార్కెట్ లేదు.. అలాంటిది రీసెంట్ గా విడుదలైన వీర సింహా రెడ్డి చిత్రానికి 70 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.. ఫుల్ రన్ లో యావరేజి టాక్ మీద 75 కోట్ల రూపాయిల షేర్ వచ్చింది.. అఖిల్ కి కూడా ‘ఏజెంట్’ సినిమాతో ఆయన లైఫ్ అలాగే టర్న్ అవుతుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. మరి అక్కినేని అఖిల్ బాబు జాతకం ఈ సినిమా తర్వాత మారుతుందో లేదో చూడాలి.