Brahmanandam : ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ఎంత మంది కమెడియన్స్ ఉన్నప్పటికీ లెజండరీ స్థానం ని సంపాదించుకున్న వాళ్ళు కేవలం కొంతమంది మాత్రమే ఉన్నారు..వీళ్ళ పవర్ ఎలాంటిది అంటే కేవలం వీళ్ళ కోసమే ప్రేక్షకులు థియేటర్స్ కి క్యూ కడుతారు..వీళ్ళు ఉండడం వల్లే ఫ్లాప్ అవ్వాల్సిన సినిమాలు కూడా సూపర్ హిట్ అవుతాయి..అలాంటి ఇమేజి ఉన్న అతి తక్కువ మంది కమెడియన్స్ లో ఒకరు బ్రహ్మానందం..ఒకప్పుడు ఈయన లేని సినిమా అంటూ ఉండేది కాదు.
ఎంత పెద్ద స్టార్ డైరెక్టర్ అయినా, ఎంత పెద్ద హీరో అయినా ఆయన డేట్స్ కోసం పడిగాపులు కాయాల్సిందే..అలాంటి స్టార్ స్టేటస్ ఉన్న బ్రహ్మానందం తనకి ఉన్న ఆరోగ్య సమస్యల దృష్ట్యా ఈమధ్యకాలం లో సినిమాలు చెయ్యడం బాగా తగ్గించేసాడు..అడపాదడపా పలు సినిమాల్లో అప్పుడప్పుడు కనిపిస్తున్నప్పటికీ ఇంతకు ముందు లాగ రెగ్యులర్ కమెడియన్ గా మాత్రం ఆయన కనిపించడం లేదు..ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి మీకెవ్వరికి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలను మీ ముందు ఉంచబోతున్నాము.
బ్రహ్మానందం సుమారుగా వెయ్యి కి పైగా సినిమాల్లో నటించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కిన సంగతి మన అందరికి తెలిసిందే.. మార్కెట్ లో ఈయనకి ఉన్న క్రేజ్ దృష్ట్యా దర్శక నిర్మాతలు ఎంత రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేసినా కాదనేవారట.. దూకుడు సినిమా టైం లో ఆయన ఒక్క రోజు కాల్ షీట్ విలువ అక్షరాలా 15 లక్షల రూపాయిలు.
ఆయన క్యాలండర్ లో ఒక్క రోజు కూడా ఖాళీ ఉండేది కాదు.. ఈ లెక్కన బ్రహ్మానందం ఏడాది సంపాదన ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు.. తాను సంపాదించిన డబ్బులను వేస్ట్ ఖర్చులకు ఉపయోగించకుండా ఆస్తులను బాగా ఏర్పాటు చేసుకున్నాడట.. ఆయన ఆస్తుల విలువ మొత్తం కలిపి 400 కోట్ల రూపాయిల వరకు ఉంటుందని అంచనా.. ఇంత మొత్తం కొంత మంది స్టార్ హీరోలకు కూడా ఉండదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.