HDB CHiranjeevi : ఒకే మూసలో వెళ్తున్న తెలుగు కమర్షియల్ సినిమాని సరికొత్త పంథాలోకి తీసుకెళ్లి డ్యాన్స్, ఫైట్స్ లో వేగం పెరిగేలా చేసిన హీరో మెగాస్టార్ చిరంజీవి. అందుకే ఆయనకీ అంత ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ ఏర్పడింది. మన తల్లిదండ్రుల జనరేషన్ ఆడియన్స్ నుండి, నేటి తరం చిన్నపిల్లల తరం ఆడియన్స్ వరకు ఆయన తన నటనతో, డ్యాన్స్ తో, ఫైట్స్ తో అలరిస్తూనే ఉన్నాడు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో ఇలాంటోళ్ళు కోట్ల మందిలో ఒకరో ఇద్దరో ఉంటారు. కెరీర్ ప్రారంభం లో ఎంత క్రమశిక్షణ ఉండేదో, ఎంత కష్టపడే తత్త్వం ఉండేదో, ఇప్పటికీ కూడా చిరంజీవి లో అదే విధంగా ఉంటుంది. అందుకే ఆయన నేటి తరం సూపర్ స్టార్స్ తో కూడా పోటీపడి వందల కోట్ల రూపాయిలను కొల్లగొడుతున్నాడు.
రీ ఎంట్రీ తర్వాత ఆయన ఆయన ఆరు సినిమాలు చేస్తే, అందులో మూడు సినిమాలు వంద కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించాయి. ఇలా నేటి తరం స్టార్ హీరోలకు కూడా లేదు అని చెప్పొచ్చు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీయేవి వసిష్ఠ అనే దర్శకుడితో ‘విశ్వంభర’ అనే చిత్రం చేస్తున్నాడు. నేడు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల అయ్యింది. సోషియో ఫాంటసీ నేపథ్యం లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. సెప్టెంబర్ 7 న వినాయక చవితిని పురస్కరించుకొని ఈ చిత్రానికి సంబంధించిన గ్లిమ్స్ వీడియో విడుదల కాబోతుంది. ఇది ఇలా ఉండగా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త ఏమిటంటే, ప్రీ రిలీజ్ థియేట్రికల్ రైట్స్ కోసం ఇప్పటి నుండే బయ్యర్లు ఫ్యాన్సీ ఆఫర్స్ తో ముందుకు వస్తున్నారట. కేవలం థియేట్రికల్ బిజినెస్ నుండే ఈ సినిమా 160 కోట్ల రూపాయిలు లాభం విడుదలకు ముందే నిర్మాతకు వచ్చే అవకాశాలు ఉన్నాయట.
అలాగే సాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్స్ , ఆడియో రైట్స్, హిందీ డబ్బింగ్ రైట్స్ ఇలా అన్నీ కలిపి ఈ చిత్రానికి 500 కోట్ల రూపాయిల బిజినెస్ జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 70 ఏళ్ళ వయస్సులో ఈ స్థాయి బిజినెస్ ఇండియా మొత్తం మీద చిరంజీవి, రజినీకాంత్ కి మాత్రమే జరుగుతుందని ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్న మాట. ప్రస్తుతం మెగా ఫ్యామిలీ కి గోల్డెన్ పీరియడ్ నడుస్తుంది, ఈ నేపథ్యంలో ‘వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రాబోతున్న ‘విశ్వంభర’ చిత్రం ఎలాంటి అద్భుతాలను సృష్టించబోతుందో చూడాలి.