Bigg Boss 8 మొదలు అవ్వని బిగ్ బాస్ 8 హౌస్ సెట్ పనులు..పారిపోతున్న కంటెస్టెంట్లు..అసలు ఏమి జరుగుతుంది?

- Advertisement -

Bigg Boss 8 : కోట్లాది మంది ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సరికొత్త సీజన్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ సీజన్ కి సంబంధించి రెండు ప్రోమోలు విడుదల అయ్యాయి. పాల్గొనబోయే కంటెస్టెంట్స్ తో దాదాపుగా అగ్రీమెంట్స్ కూడా పూర్తి అయ్యాయి. అయితే పూర్తి స్థాయి కంటెస్టెంట్స్ లిస్ట్ మాత్రం ఇంకా ఖరారు కాలేదని లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్. ఈ సీజన్ ఇంతకు ముందు సీజన్స్ తో పోలిస్తే చాలా కష్టం గా, కొత్త ఉండబోతోంది. కంటెస్టెంట్స్ వాటిని తట్టుకొని కొన్ని వారాలు హౌస్ లో ఉండడం సాహసమే. అలాంటి పరిస్థితి ఉండడంతో ఒప్పందం సమయం లో కొన్ని రూల్స్ కి అంగీకరించలేక కంటెస్టెంట్స్ ఒక్కొక్కరిగా తప్పుకుంటున్నారని లేటెస్ట్ గా ఇండస్ట్రీ సర్కిల్స్ లో ఒక వార్త జోరుగా ప్రచారం సాగుతుంది.

Bigg Boss 8
Bigg Boss 8

లెక్క ప్రకారం ఈ సీజన్ సెప్టెంబర్ 1 నుండి ప్రారంభం అవ్వాలి. కానీ ఇప్పటి వరకు అన్నపూర్ణ స్టూడియోస్ లో బిగ్ బాస్ హౌస్ సెట్ పనులు ప్రారంభమే కాలేదట. ఇదే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం. నెలరోజుల ముందే సెట్ పనులు పూర్తి చేసి సీజన్ ప్రారంభం కోసం ముస్తాబయ్యే బిగ్ బాస్ హౌస్, సీజన్ ప్రారంభ తేదికి సమీపిస్తున్నా కూడా ఇంకా సెట్ పనులు పూర్తి కాకపోవడం పై ఇప్పుడు గందరగోళం నెలకొంది. అంటే కాదు ఆగస్టు 15 కి ప్రతీ ఏడాది బిగ్ బాస్ సరికొత్త సీజన్ ప్రారంభమయ్యే తేదీ చెప్పేవాళ్ళు. కానీ ఇప్పటి వరకు ప్రారంభ తేదీ ప్రకటించలేదు. ముందుగా సెప్టెంబర్ 1 వ తేదీన ఈ సీజన్ ప్రారంభం చెయ్యాలి అనుకున్నారు, కాని ఇప్పుడు సెప్టెంబర్ 8 కి వాయిదా పడినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

Bigg Boss 8 Telugu: Star Telugu Youtuber to be a part of the reality show

- Advertisement -

అందుకు కారణం కంటెస్టెంట్స్ లిస్ట్ ఇంకా పూర్తి స్థాయిలో రెడీ కాకపోవడం వల్లే. ఇంతకుముందు సీజన్స్ లో కంటెస్టెంట్స్ మొత్తం ఆగస్టు 15 కి ఖరారు అయ్యేవారు, కానీ ఈసారి ఆ పరిస్థితి లేకపోవడం విశేషం. ఇకపోతే ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఖరారైన కంటెస్టెంట్స్ ని ఒకసారి పరిశీలిస్తే తేజస్విని గౌడా, రీతూ చౌదరీ, అంజలి పవన్, ఇంద్రనీల్, బంచిక్ బబ్లూ, ఆదిత్య ఓం , జబర్దస్త్ నరేష్ వంటి వారు ఈ షోలో పాల్గొనేందుకు ఒప్పందం చేసేసుకున్నారు. ఇది చాలా కఠినతరమైన సీజన్ కావడంతో ప్రతీ కంటెస్టెంట్ కి రెమ్యూనరేషన్ కూడా భారీ స్థాయిలో ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది.

Bigg Boss Telugu Season 8 Promo Drops: Nagarjuna And Satya Tease Unlimited Entertainment, Fun, And Twists! - Filmibeat

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here